top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 1




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।

దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀


🌻 512. 'దధ్యన్నాసక్త హృదయా' - 1 🌻


పెరుగుతో కూడిన అన్నమునందు ఆసక్తిగలది శ్రీమాత అని పెరుగుతో కూడిన అన్నము స్వాధిష్ఠాన కేంద్రమందలి దేహ ధాతువుల అభివృద్ధికి తోడ్పడును. ఆరోగ్యకరము. ఉప్పు, పులుపు, తీపి, కారము యిత్యాది ఆహారముల యందలి హెచ్చుతగ్గులను పెరుగన్నము సరిదిద్ది సమన్వయ పరచును. పెరుగన్నము తినని వారికి కడుపున ప్రకోపము లెక్కువగ నుండును. రకరకముల ఆమ్లములు, క్షారములు సమన్వయపడక జీర్ణకోశమంతయూ అస్తవ్యస్తమై నీరసము, విసుగు, చిరాకు, కోపము యిత్యాదివి యేర్పడి దేహమునకు అస్వస్థతను కలిగించును. స్వాధిష్ఠానము సమవర్తనము కోల్పోయినచో ఆరోగ్యము అస్తవ్యస్థ మగును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻105. Medhonishta maduprita bandinyadi samanvita

dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻


🌻 512. 'Dadhyannasakta Hrudaya' - 1🌻


Srimata likes rice with curd, rice with curd helps in the development of body minerals in Swadhishthana centre. It is healthy. Salt, sour, sweet, spicy and other fluctuations in food are corrected and coordinated by curd rice. For those who do not eat curdrice, stomach irritation is inevitable. Different types of acids and alkalis are not coordinated and the entire digestive system is disturbed and it causes the body to feel unwell including dullness, boredom, irritation, anger etc. If Swadhishthana is out of balance, health will be disturbed.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page