top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 2




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 512 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।

దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀


🌻 512. 'దధ్యన్నాసక్త హృదయా' - 2🌻


పెరుగన్నము తుది అంశముగ భోజనము ముగించుట ఆరోగ్యకరము. ఇతర అంశములను బాగుగ భుజించి పెరుగన్నము క్లుప్తము చేయుదురు. ఇది సరికాదు. రెండు వంతులు యితర భోజనము గావించి ఒక వంతు పెరుగన్నమునకు యేర్పరచుకొనవలెను. పులిసిన పెరుగు, మజ్జిగ వర్ణనీయము. దైవోపాసకులు ఈ విషయమును గ్రహింపవలెను. దేహమునందు ప్రాణము అస్తవ్యస్తమై యుండగ పూజయందు మనసు నిలబడదు. దేహము తగుమాత్రము ఆరోగ్యముగ వుండుట ప్రధానము. ఈ పద్మమందుగల యోగినీ మాతకు దధ్యాన్నము నైవేద్యము పెట్టుట వలన తృప్తి చెందునని చెప్పుటలో పై విషయమును గ్రహింప గలరు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 512 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻105. Medhonishta maduprita bandinyadi samanvita

dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻


🌻 512. 'Dadhyannasakta Hrudaya' - 2🌻


It is healthy to end the meal with curdrice. People take other items heavily and take very little curdrice. This is incorrect. Two-third should be other items and one-third should be reserved for curdrice. Fermented curd, buttermilk are describable. Devotees should understand this. If the life in the body is disordered then the mind cannot focus on worship. It is important to keep the body fit and healthy. It is to be observed that the Yogini Mata in this lotus flower is satisfied by an offering of curdrice.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Commentaires


bottom of page