top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 513 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 513 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।

దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀


🌻 513. 'కాకినీ రూప ధారిణీ' - 2 🌻


షట్చక్ర నిరూపణము నందుగల వివరములకు, లలితా సహస్రము నందు గల వివరములకు వ్యత్యాస మున్నట్లు గోచరించును. నిజమున కట్టి వ్యత్యాసము లన్నియూ అంతర్గత ధ్యానమున పరిష్కారము కాగలవు. యాకినీ, హాకినీ, సాకినీ, కాకినీ, లాకినీ, రాకినీ, డాకినీ యిట్లు ఏడు నామములు అటు యిటుగా ఏడు కేంద్రములలో చెప్పబడెను. నిజమునకు ఈ దేవత లందరునూ బీజాక్షర సంకేతములు. యం, హం, సం, కం, లం, రం, ఢం- ఇవి అన్నియూ బీజాక్షరములే. వీనికి గల ఆరోహణ అవరోహణ క్రమములు అంతర్దృష్టికి సమముగ గోచరింప గలవు. స్వాధిష్ఠానమున వరుణ బీజముగ 'వం' కూడ తెలుపబడి యుండును. వీటి పరిష్కారములు గురు శిష్య అనుగతముగ తెలియును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻105. Medhonishta maduprita bandinyadi samanvita

dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻


🌻 513. 'kakini rupadharini' - 2 🌻


There is a discrepancy between these details in the Shatchakra Nirupana and the details in the Lalita Sahasranama. In fact, all differences can be resolved through internal meditation. Yakini, Hakini, Sakini, Kakini, Lakini, Rakini, Dakini are mentioned in seven centers. In fact, these goddesses are all symbols( beeja aksharas). Yam, Ham, Sam, Kam, Lum, Rum, Dham- these are all powerful symbols( beeja aksharas). The ascending and descending order of these can be discerned by insight. Lord Varuna's symbol 'Vam' is also mentioned in Swadhisthana. Teachings from Guru to the student will get the solutions of these.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page