top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।

ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀


🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 2🌻


మూలాధార ప్రజ్ఞ ఆరోగ్యముగ నున్నచో ఎముకలు పటిష్ఠములై, పుష్టములై భౌతిక రూపము చాలా కాలము చెడకుండ నిలచును. సహస్రారము నుండి మూలాధారమునకు శ్రీమాత అవతరణమే సృష్టి అవతరణము. సృష్టి మూలాధారము చేరుసరికి పరిపూర్ణత చెందును. అట్టి సృష్టిలో జీవులందరూ ఏడు లోకములను నిండి నివసింతురు. మరల ఆరోహణ క్రమమున సహస్రారమును చేరుటకే దివ్యవిద్య లన్నియూ. సహస్రారమునందెట్టి ప్రజ్ఞ యున్నదో మూలాధారము నందు కూడ అట్టి ప్రజ్ఞయే యున్నది. సహస్రారము నంతయూ అవ్యక్తము. మూలాధారమున అంతయూ పూర్ణ వ్యక్తము. ఒకటి అమావాస్య వంటిది కాగ రెండవది పూర్ణిమ వంటిది.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini

aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻


🌻 520. Sakinyanba Svarupini - 2 🌻


If the Mooladhara energy is healthy, the bones will be strong and the physical form will remain intact for a long time. Shrimata's manifestation from Sahasrara to Mooladhara is the manifestation of the universe. It is perfected when it reaches the source of creation. In such a creation, all living beings inhabit the seven worlds. Again, in the order of ascension, to reach the Sahasrara, all the divine vidyas are needed. The kind of wisdom that is there in Sahasrara, is the same kind of wisdom that is there in Muladhara. Everything is all implicit at Sahasrara. Everything is completely explicit at Mooladhara. One is like Amavasya and the other is like Purnima.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page