top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 3



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥


108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀


🌻 521 to 528 నామ వివరణము - 3 🌻


ఘనమునకు కూడ ఆరు ముఖములు కలవు. ఆరు ముఖములు సంవత్సర మందలి ఆరు ఋతువులతో పెద్దలు సమన్వయింతురు. తత్కారణముగ సంవత్సర చక్రమును గాయత్రి స్వరూపముగ దర్శించు సంప్రదాయ మేర్పడినది. ఆరు ఋతువుల యందు పన్నెండు పూర్ణిమలు, పన్నెండు అమావాస్యలు కలవు. ఈ ఇరువది నాలుగు పర్వదినములు గాయత్రి మాత ఇరువది నాలుగు తత్త్వములుగ సంవత్సరమున దర్శించి కీర్తించుట ఋషుల సంప్రదాయము. గోళము వ్యక్తరూపమే ఘన మనియూ, ఘనము సృష్టి సమగ్ర రూపమనియూ, అట్టి ఘనము శ్రీమాత చైతన్యమనియూ తెలియవలెను.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥


108. Majasansdha hansavati mukhyashakti samanvita

haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 521 to 528 Names Explanation - 3 🌻


The gross world also has six faces. The elders coordinate the six faces with the six seasons of the year. Thus the tradition of seeing the cycle of a year as the form of Gayatri. There are twelve full moons and twelve new moons in the six seasons. It is the tradition of sages to visualise and glorify these twenty four days of the year as the twenty four tattvas of Mata Gayatri. It should be known that the sphere is the gross manifestation of the integral form of creation, and this gross form is the consciousness of Shrimata.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page