top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 5



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 5 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥


108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀


🌻 521 to 528 నామ వివరణము - 5 🌻


పదునెనిమిది పర్వములతో కూడిన మహా భారతము వేదవ్యాస మహర్షి 'జయము' అని పేర్కొనినాడు. యజము నిర్వర్తించిన వారికే జయము అని రహస్యార్థమును తెలిపినాడు. అట్లే భగవదుపదేశమును కూడ పదునెనిమిది అధ్యాయములలో యేర్పరచినాడు. సృష్టి యందు పదునెనిమిది తత్త్వములు దివ్యములని, అమృతములని, అవ్యక్తములని, ఆరు తత్త్వములు వ్యక్తములని పురుష సూక్తమున ప్రతిపాదింపబడినది. ఇట్టి వ్యక్తా అవ్యక్త సృష్టికి శ్రీమాతయే ఆధారము. అట్టి శ్రీమాతను భ్రూమధ్యమున ద్విదళ పద్మమున ఆరాధించి దర్శించుట ఉత్తమోత్తమమని ఋషుల అభిప్రాయము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 5 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥


108. Majasansdha hansavati mukhyashakti samanvita

haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 521 to 528 Names Explanation - 5 🌻


Sage Vedavyasa called Maha Bharata consisting of eighteen Parvas as 'Jayam'. He explained the secret meaning that victory is for those who perform Yajam. Similarly, he structured the Lord's message in eighteen chapters. It is proponed in Purusha suktam that eighteen tattvas in creation are divine, immortal, immanent and six tattvas are manifest. Sri Mata is the basis of this manifested and unmanifested creation. Sages are of the opinion that it is the highest state to see and meditate upon Srimata in the double petaled lotus at the center of the eyebrows.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page