top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 8




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 8 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥


108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।

హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀



🌻 521 to 528 నామ వివరణము - 8 🌻


శ్రీమాత ఆరాధకులు అనుగ్రహము పొందుటకు, పసుపుతో కూడిన అన్నమును ఈమెకు నైవేద్య మొసగి తాము భుజింతురు. శ్రీమాతకు పసుపు అన్నము అనినచో యిష్టము. ఆమె హరిద్రాన్నైకరసికా'. వారమున కొకమారైననూ పసుపు అన్నము భుజించుట వలన శరీరమందలి రుగ్మతలు నశించునని ఆయుర్వేదము తెలుపుచున్నది. ఈ ఆజ్ఞా పద్మమందలి శ్రీమాతను 'హం' అను శబ్దముతో ఆరాధించుట సంప్రదాయము. 'హం' అనునది మూల ప్రకృతికి సంబంధించిన శబ్దముగను, 'సం' అను శబ్దము మూల పురుషునికి సంబంధించిన శబ్దముగను ఋషులు గుర్తించి కీర్తించిరి.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 8 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥


108. Majasansdha hansavati mukhyashakti samanvita

haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 521 to 528 Names Explanation - 8 🌻


Devotees of Sri Mata offer her turmeric rice and eat it to get her grace. Srimata likes yellow rice. She is Haridrannaikarasika'. Ayurveda says that by eating yellow rice atleast once a week, body diseases will be destroyed. It is a tradition to worship this Srimata at Agnya chakra with the sound of 'Hum'. The sages recognized and glorified that 'Ham' as the root of nature and 'Sam' as the root of Purusha.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentarios


bottom of page