top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 533 / Sri Lalitha Chaitanya Vijnanam - 533




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 533 / Sri Lalitha Chaitanya Vijnanam - 533 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।

సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀


🌻 533. 'సర్వతోముఖీ' 🌻


అన్ని దిక్కుల యందు ముఖము కలది శ్రీమాత అని అర్థము. సహస్రమను సంఖ్యను 10 x 10 × 10గ గుర్తించవచ్చును. పదిమార్లు ఆరోహణము చేసినపుడు ఒక పూర్ణమగు స్థితి లభించును. అట్టిది నూరుమార్లు పూర్ణ స్థితిగ ఊహించినచో వేయి సంఖ్య అనగా ఎంతటి పరిపూర్ణమో తెలియును. వేయి దళములు, వేయి శబ్దములు, వేయి రంగులు, వేయి అక్షరములు, వేయి ఆయుధములు యిట్లు ఊహించినపుడు, ఊహించు వాడు కరగిపోవుటయే జరుగును. ఇచ్చట పది దిక్కుల యందును, ఉన్ముఖముగ నున్న శ్రీమాత ముఖములు వర్ణింపబడినవి. అనగా విశ్వమునంతనూ ఒక్కమారుగ దర్శనము చేయు శక్తి అని తెలియవలెను. అన్ని దిక్కులను ఏక కాలమున అనుగ్రహించు మాత అని తెలియ వలెను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 533 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita

sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻


🌻 533. 'Sarvatomukhi' 🌻


Shrimata has a face in all directions. The number Sahasra can be identified as 10 x 10 x 10. After ascending ten times one attains a perfect state. If you imagine it as a perfect state a hundred times, you will know how perfect the number of thousand is. When one imagines a thousand petals, a thousand sounds, a thousand colors, a thousand spells, a thousand weapons, the imaginer melts away. Here, the faces of Sri Mata are depicted in ten directions. In other words, it should be known as the power to see the entire universe in a single look. It is to be known that she is the mother who blesses all directions at the same time.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




コメント


bottom of page