top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 534 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 534 -1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 534 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 534 -1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।

సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀


🌻 534. 'సర్వౌదన ప్రీత చిత్తా' - 1 🌻


పాయస్నానము మొదలుగ హరిద్రాన్నము వరకు గల అన్ని రకముల అన్నాహారములయందు ప్రీతి కలది శ్రీమాత అని అర్థము. షట్ పద్మములను వర్ణించినపుడు వివిధ అన్నాహారములు తెలుపబడినవి. నేతి అన్నము, గుడాన్నము, పాయసాన్నము, దధ్యాన్నము, పప్పు అన్నము, చిత్రాన్నము. ఈ అన్నము లన్నిటియందు ప్రీతిగలది ఈ పద్మమందలి శ్రీమాత. అందులకే అన్నమందు అన్ని కూరగాయలు, అన్ని పప్పులు, బెల్లము, నెయ్యి వేసి సర్వాదనమును తయారుచేసి నైవేద్యము పెట్టుట ఆచారముగ వచ్చినది. దీని రూపాంతరమే ప్రస్తుతము వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనుచూ భుజించుచున్నారు. ఇది సమగ్రము కాదు. ఏదెట్లున్ననూ ఆహారము నందు ప్రీతి యుండుట ఆరోగ్యమునకు సంకేతము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 534 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita

sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻


🌻 534. 'Sarvaudana Preeta Chitta' - 1 🌻


It means that Sri Mata is fond of all types of rice recipes from Payasaannam to Haridrannam. Various rice foods are mentioned when the six padmas are described. Ghee rice, Jaggery rice, sweet rice, Curd rice, Dal rice, chitraanna. The Sri Mata in this lotus likes all these rice recipes. Hence it is customary to prepare Sarvadanam by adding all the vegetables, all pulses, jaggery and ghee to them and offering it to Her. Its variant is currently eaten as vegetable fried rice. It is not comprehensive. Love for any kind of food is a sign of health.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page