top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 536 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 536 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా,ఽమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 536. 'స్వాహా స్వధా' - 1 🌻


అగ్ని తత్త్వము పరమశివుడు కాగా అగ్నిరూపము ధరించునది. శ్రీమాత. అట్టి శ్రీమాతను స్వాహా మరియు స్వధా అని పిలుతురు. కావున ఈ రెండు నామములు ఒకే తత్త్వమును సూచించు శ్రీమాత నామములని తెలియవలెను. స్వాహా శబ్దమునకు అనేక అర్ధము లున్నవి. దేవతలకు తుష్టిని పుష్టిని ఇచ్చునది స్వాహాదేవి. తానే రక రకములగు హెూమ ద్రవ్యములై అగ్ని స్వరూపిణిగ వానిని భక్షించుచు వివిధ దేవతలకు తుష్టిని పుష్టిని కలిగించునది అని అర్థము. అట్లే తర్పణముల ద్వారా పితృదేవతలకు తుష్టిని పుష్టిని యిచ్చునటువంటి దేవి కనుక స్వధా అందురు. 'స్వ' అనగా స్వర్గము. 'స్వ' అనగా ఆత్మ. 'ఆహా' అనగా గతి పొందుట.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 536 -1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 536. 'Swaha Swadha' - 1 🌻


While Paramashiva has the characteristics of the fire ( Agni Tattva) Srimata wears the form of fire (Agni Roopa). Srimata here is referred by the names of Swaha and Swadha. Therefore, it should be known that these two names represent the same philosophy. The word Swaha has many meanings. Swahadevi is the giver of Prosperity and Contentment to the gods. It means she herself takes the form of various offerings in the sacrifice ritual and then consumes the offerings in the form of fire thereby giving prosperity and satisfaction to the deities. Swadha is the goddess who gives satisfaction to the ancestral gods through such offerings. 'Swa' means heaven. 'Swa' means soul. 'Aha' means reaching a state.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page