top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 537. 'అమతి' - 2 🌻


బుద్ధి, ప్రాణ స్పందనము, అహంకారము, త్రిగుణములు యివి అన్నియూ మతికి ఆవలయున్న స్థితులు. మతిగ కూడ నుండునది శ్రీమాతయే అయినప్పటికినీ ఆమె మతికి అతీతమని తెలియవలెను. మతి కలిగినప్పుడే అమితముగ అనుమతి కలుగును. రస స్వరూపిణి యైన శ్రీమాత మతికి అందునది కాదు. తత్వానుభూతి జీవునకు సంబంధించినది కాని మనస్సంబంధితము కాదు. మతి లేకుండుట అన్నది అతీత స్థితియే గాక అవిద్యాస్థితి యని కూడ తెలియవలెను. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, జంతువు యిత్యాది వాటికి కూడ మతి లేదు. అట్లే మతి లేని మానవులున్నారు. వీరందరునూ అవిద్యా స్థితికి గురియైనటువంటివారు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 537. 'Amati' - 2 🌻


Intellect, life force, egoism, trigunas are all states beyond the mind. It should be known that she is beyond the mind even though she herself is the mind. Permission is given mostly when there is a mind. Srimata who is the personification of Rasa, is beyond mind. The experience of Tatva is related to the soul but not to the mind. It should be known that lack of mind is not only a state of transcendence but also a state of ignorance. A stone, a rock, a tree, a flower, an animal etc. have no mind either. There are humans who have no mind. All of them are in a state of ignorance



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page