top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 538 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 538 - 1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 538 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 538 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 538. 'మేధా’ - 1 🌻


సకల శాస్త్రసారమైన శ్రీమాత అని అర్ధము. సర్వ భూతములందు మేధా రూపము ధరించునది శ్రీమాత. వారి యందలి ధీశక్తియే మేధా. ఆకాశమున ప్రకాశముగను, వాయువు నందు బలముగను, అగ్నియందు తేజస్సుగను, జలము నందు తుష్టి గను, పదార్థములయందు పుష్టిగను వుండునది శ్రీమాత. ఉప్పు ఉప్పగ నుండుటకు కారణము శ్రీమాతయే. అట్లే పంచదార యందు తీపిగ యుండును. ఇట్లు ప్రతి వస్తువు నందును దాని గుణముచే ప్రకాశించునది శ్రీమాత. అన్నిటి సారము శ్రీమాత. త్రిగుణము లందలి త్రిశక్తి కూడ ఆమెయే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 538 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 538. 'Medha' - 1 🌻


It means Srimata is the essence of all shastras.Shrimata is in the form of intelligence in all the beings. Their strength is their intelligence. Shrimata is the brightness in the sky, the strength in the wind, the radiance in the fire, the thirst in the water and the health in the materials. Srimata is the reason for the saltiness in the salt. She is the sweetness in sugar. Thus Srimata shines in every object by its quality. Srimata is the essence of everything. She is also the trishakti in the trigunas.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comentários


bottom of page