top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 1




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 539. 'శ్రుతిః' - 1 🌻


వేదరూపిణి శ్రీమాత అని అర్ధము. వేద మనగా తెలియదగినది. ఏది తెలిసిన మరి తెలియ వలసిన దేదియు వుండదో దానిని వేద మందరు. అట్టి వేదమును ఒక రూపముగ నూహించినచో వేదమాత అనగా నేమో తెలియును. వేదరూపిణి అనగా నేమో తెలియును. తెలియకోరువాడు, తెలియ వలసినది, తెలుసుకొను కార్యము మూడునూ దేనినుండి దిగివచ్చుచున్నవో అది వేదము. కర్త కర్మ క్రియలకు మూలము వేదము. మూల ప్రకృతికి, కాలమునకు కూడ మూలము వేదము. సమస్తము పుట్టుకకు మూలము వేదము. దానినే తత్ అనిరి. బ్రహ్మము అనిరి. వేదము అనిరి.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 539. 'Shrutih' - 1 🌻


Vedarupini is the Mother. Veda is knowable to us. That when known leaves nothing to be known is called Veda. If one imagines such a Veda with a form, then one would know Veda Mata. One would know what Vedarupini means. The one who wants to know, the thing to be known, and the act of knowing, that from which all these three descend, that is Veda. Vedas are the source of the subject, object and action. Veda is the source of nature and time. Veda is the source of all birth. That is called Tat. That is called Brahman. That is called Veda.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page