top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।

స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀


🌻 539. 'శ్రుతిః' - 2 🌻


వేదము నుండియే ప్రథమ సంకల్పము ఏర్పడును. కాలము ఏర్పడును. ప్రకృతి పురుషులు ఏర్పడుదురు. మహదహంకారము, త్రిగుణములు యేర్పడును. త్రిగుణముల నుండి సృష్టిజీవులు, లోకములు యేర్పడును. పంచభూతాత్మక సృష్టి యేర్పడును. ఇట్లు అన్నిటికి మూల మేదియో తెలియుట వేదములు తెలియుట, బ్రహ్మమును తెలియుట, తత్త్వమును తెలియుట. ఈ తత్త్వము ఏమియూ లేనట్లుగ యుండును. చోటువలె యుండును. అందుండి క్రమముగ అన్నియూ యేర్పడును. ఏర్పడిన వాటి కన్నిటికినీ కాలపరిమితి యుండును. కాని ఆ తత్త్వము మాత్రము కాలమునకు కూడ మూలమై యుండును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini

svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻


🌻 539. 'Shrutih' - 2 🌻


The first will is formed from the Veda itself. Time is formed. Nature and man are formed. Mahadahankara, Triguna aree formed. Creatures and worlds are formed from trigunas. The creation with five elements is formed. Knowing the root of all these means knowing the Vedas, knowing Brahma, knowing Tattva. This philosophy is like nothing. It will be like a place. From there everything will be formed gradually. There is a time limit for all those that are formed such. But that philosophy would also be the source of time.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page