top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।

పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀


🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 1 🌻


పుణ్య విషయములను వినుట, ప్రశంసించుట గలది శ్రీమాత. పుణ్యమగు కథలను వినుట పుణ్య శ్రవణము. శ్రీమద్రామాయణము, శ్రీమద్భాగవతము, శ్రీమహాభారతము కథలను ప్రవచించునపుడు అచట శ్రీమాత కూడ చేరి వినును. అట్లే తన కథలను భక్తులు ప్రవచించుకొనునపుడు శ్రీమాత వినును. శాశ్వత కీర్తివంతులగు మహాత్ముల కథలను వినునపుడు కూడ ఆమె ఉత్సాహముతో వినును. హరి కథలు, శివ కథలు, దేవతా విజయములు యిత్యాది ఉపాఖ్యానములను వినినపుడు కూడ ఉత్సాహముతో వినును. అనురక్తితో శ్రవణము చేయును. పుణ్య కథలను వినుటయందు శ్రీమాతయే ఉత్సాహపడి నపుడు వాటియం దాసక్తి లేనివారు ఎంతటి దురదృష్టవంతులు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana

pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻


🌻 544. 'Punyashravana Kirtana' - 1 🌻


Shrimata is the one who listens to and praises pious things. Listening to pious stories is pious listening. Srimata also joins and listens when the stories of Srimadramayana, Srimadbhagavatam and Srimahabharata are narrated. Shrimata also listens to the devotees prophesying her stories. Even when she listens to the stories of eternally famous Mahatmas, she listens with enthusiasm. She also listens with enthusiasm Hari stories, Shiva stories, deity victories etc. she listens attentively. When Srimata herself is enthusiastic to listen to pious stories, how unfortunate are those that are not interested in them.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page