top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।

పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀


🌻 546. 'బంధమోచనీ’ - 2 🌻


ఒంటరి తనమున బలహీనత, బంధము కలుగును. పంచేంద్రియముల చేతను, త్రిగుణముల చేతను శరీరమున బంధింపబడి అనేకానేక బాధలను చెందును. ఇట్టి వానికి తరణోపాయము కలుగవలె నన్నచో శ్రీమాతయే శరణ్యము. సర్వ సంకల్పములు ఆమె నుండియే జనించును. తాను ప్రత్యేకముగ నున్నానను సంకల్పము తన కెచ్చటి నుండి కలిగినది? తనలోని చైతన్యము నుండి కలిగినది. అట్టి వానికి తాను చైతన్యమే. చైతన్యమే తానుగ నున్నాడు. అట్లే సర్వజీవరాశులును అని తెలిపినపుడు అవిద్య తొలగును. ఈ భావము కూడ చైతన్యము నుండి కలుగవలసినదే కదా! అట్టి భావము కలుగుటకు శ్రీమాత అనుగ్రహము కావలెను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana

pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻


🌻 546. 'Bandhamochani' - 2 🌻


A lonely person will feel weak and bound. He is bound in the body by the five senses and the trigunas, and suffers many pains.Srimata is the only refuge for this person. All intentions are born from her. Where s the will derived from its virtue that one is special? For him he is consciousness itself. He himself is consciousness. Ignorance will be removed when he is told that it's the same for all living beings. This feeling should also arise from consciousness! Srimata's grace is needed to get such a feeling.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentários


bottom of page