top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 2

Updated: Jun 19




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 548 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀


🌻 548. 'విమర్శరూపిణీ’ - 2 🌻


ఉదాహరణకు విద్యుత్తును చూడలేము. అది ప్రకాశించి నపుడు విద్యుత్తు నెరుగుచున్నాము కదా! అట్లే ఆకాశమును తెలియలేము కాని అందుండి పుట్టు వాయువును తెలియుచున్నాము కదా! వాయువును, శ్రీమాతను ప్రత్యక్ష బ్రహ్మలందురు. వీని వలన పరోక్షమగు విషయము తెలియుచున్నది. శ్రీమాత వలననే బ్రహ్మము తెలియనగును. మరియొక మార్గము లేదు, మరియొక ఉపాయము లేదు. మనయందలి విమర్శనాశక్తి శ్రీమాతయే. విమర్శ వలన కలిగిన ప్రకాశముతో కర్తవ్యము నెరిగి ప్రవర్తింపవచ్చును. ఆత్మ విమర్శ స్వయం విమర్శ లేనివారు గ్రుడ్డివారై చతికిల పడుచుండుట ప్రపంచమున చూచుచున్నాము కదా!



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 548 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh

sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻


🌻 548. 'Vimarsharupini' - 2 🌻


For example electricity cannot be seen. When it shines in the form of light, we are seeing electricity! We do not know the sky, but we know the air that comes from it! Air and Srimata are known as manifested brahman. Because of them an indirect concept is known. Brahma is known only through Srimata. There is no other way, no other option. Shrimata is the ability that is in us to reflect. Duty can be performed by the brightness achieved through reflection. We see in the world those who do not have self-reflection going about blind and squatting away!



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentários


bottom of page