top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1

Updated: Jun 25




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀


🌻 549. 'విద్యా' - 1 🌻


జ్ఞాన స్వరూపమైనది శ్రీమాత అని అర్ధము. విద్య అనగా తెలియవలసినది మరియు తెలియదగినది. ఏది తెలిసిన అన్నియును తెలియునో అదియే విద్య. అదియే వేదము. శ్రీమాతను వేదస్వరూపిణి, వేదమాత అని కూడ ప్రశంసింతురు. నిరాకారము అనిర్వచనీయము అగు బ్రహ్మము ఆమెగా ప్రకాశించును. ఆమెను తెలిసినపుడే బ్రహ్మమును తెలియుట జరుగును. తెలియుట అనగా శ్రీమాతమే. ఆమె వలననే ఆమెను తెలియుట కూడ జరుగును. కనుక ఆమె ఆరాధనము తప్ప అన్య మార్గము లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh

sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻


🌻 549. 'Vidya' - 1 🌻


Meaning that Srimata is the embodiment of knowledge. Education means something that is to known and is knowable. Knowledge is that when known, there's nothing remains to know. That is Veda. Srimata is also praised as Vedasvarupini and Vedamata. The formless indefinable Brahma shines as her. Brahma is known only when she is known. To know is Sri Mata. It is because of her that she is known. So there is no other way but to worship her.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page