top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 1

Updated: Jul 7




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀


🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 1 🌻


సర్వ బాధలను నివారించునది శ్రీమాత అని అర్థము. వ్యధలు కారణముగ వ్యాధి యేర్పడును. చపల చిత్తము, కలత, ఆందోళన, అశాంతి, దుఃఖము, నిరాశ, నిస్పృహ, భయము, కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, మోహము, ఆత్రుత ఇత్యాది వన్నియూ వ్యధలే. ఈ వ్యధల నుండి ప్రాణము సమతుల్యమును కోల్పోవును. అపుడు వ్యాధులు కలుగును. నిర్మలమగు తటాకమున ఒక చిన్న బెడ్డను విసిరినచో ఎన్నియో తరంగము లేర్పడును. అట్లు వికృతమగు భావముల నుండి ప్రాణమున కవరోధము కలిగించు అనేకానేక తరంగము లేర్పడును. ఈ తరంగముల కారణముగ శరీరమున వ్యధలు, వ్యాధులు యేర్పడును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh

sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻


🌻 551. 'Sarvavyadhi Prashamani' - 1 🌻


It means that Srimata is the one who dispels all sufferings. Troubles are the cause of disease. Frustration, agitation, anxiety, restlessness, sadness, despair, depression, fear, anger, jealousy, envy, hatred, lust, anxiety are all troubles. Prana loses its balance because of these troubles. Then diseases occur. If a small stone is thrown in a placid lake, multiple waves are formed. From such perverted feelings, many waves arise that block the life. These waves cause diseases and troubles in the body.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page