top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 3



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 551 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀


🌻 551. 'సర్వవ్యాధి ప్రశమనీ' - 3 🌻


ప్రకృతి సహజమగు భావము, భాషణము, ఆచరణము గల వారికి వ్యాధులంతగ సోకవు. కాలము, దేశము, సంఘములను బట్టి ఒక వేళ వ్యాధులు సోకిననూ అట్టి వారిని ఆ వ్యాధులు కృశింపజేయవు. వికృత భావములు, భాషణములు, చేష్టలు కలవారిని వ్యాధులు లొంగ దీసుకొని కృశింపజేయును. ఇది సత్యము. ధర్మపరులకు ప్రకృతిగను, అధర్మపరులకు వికృతిగను శ్రీమాత వారి స్వభావము నుండి వర్తించును. ఇది ఆమె శిష్ట రక్షణము, దుష్ట శిక్షణము కార్యములలో నొకటి. అవసరమగుచో తల్లి బిడ్డకు శిక్షణ నిచ్చుట కద్దుయే కదా! ఆమె సర్వభూతహిత రతి కలిగినది. ఎట్లైననూ జీవులను రక్షించును. శిక్షించుట ఆమె రక్షణలోని అంతర్భాగమే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 551 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh

sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻


🌻 551. 'Sarvavyadhi Prashamani' - 3 🌻


People who have natural feelings, speech and practice are not usually inflicted with ailments. Depending on the time, space and community, even if they are inflicted with ailments, those diseases do not weaken them. Those who have perverted feelings, speech and behavior will be subdued by diseases and become weak. This is the truth. Srimata applies appropriately upon the righteous and perverse. This is one of her ways of protecting the noble and punishing the evil. Shouldn't the mother train the child if necessary? She wishes well on everyone. At any cost, she saves the living beings. Punishment is an integral part of her protection.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page