top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀


🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 1 🌻


అపమృత్యువును, అకాల మృత్యువును మాత్రమే కాక మరణాను భవము కూడ నివారించునది శ్రీమాత అని అర్థము. అపమృత్యు వనగా అర్థాంతర మృత్యువు. పూర్ణ జీవితము జీవించక, తన వంతు కర్తవ్యమును నిర్వర్తింపక జీవితము సగభాగముననే మరణించుట అపమృత్యువు. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, వానప్రస్థము, ఇత్యాది మజిలీలు అన్నియూ అనుభవించి సంఘపరము, కుటుంబపరమునగు కర్తవ్యములను పూర్ణముగ నిర్వర్తించి పితృఋణము, దేవ ఋణము కూడ తృప్తికరముగ నిర్వహించి జీవునిగ పండి, దేహము విడచుట సవ్యమగు మృత్యువు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh

sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻


🌻 552. 'Sarvamrutyu Nivarini' - 1 🌻


It means that Srimata is the one who dispels not only mortality and premature death but also the feel of death itself. Apamrutyu means death that occurs suddenly. Not living a full life and dying half way through the life without fulfilling one's duty is untimely death. After experiencing all the stages of childhood, adolescence, youth, adulthood, and retirement, when one fulfills one's social and family duties, fulfills one's duty to one's ancestors, and fulfills one's debt to deities to satisfaction, matures as a jeeva and leaves the body it is considered as normal death



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page