top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 7



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 7 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।

సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀


🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 7 🌻


సుందర కాండము, మహాయోగుల జీవితములు, సనత్సుజాతీయము వంటివి కూడా మృత్యువు స్వరూప స్వభావములను వివరించుచూ మృత్యువును దాటు ఉపాయములను అందించినవి. శ్రీమాత సర్వమృత్యు నివారిణి గనుక ఆమె ఆరాధనమున ఉపాసకులు ఆమె వెలుగున ప్రవేశింతురు. ఆమె వెలుగు ఆవరణలో ప్రవేశించుట నేర్చినవారికి దేహము విడచుటయే యుండును గాని దేహమున మరణించుట యుండదు. అట్లే అకాల మృత్యువు, అపమృత్యువు కూడ నుండదు. శ్రీదేవి ఆరాధనమున ఆమె దివ్యకాంతిని తమయందు దర్శించుచూ ఆ కాంతి ఆవరణలో ప్రవేశించుట జరుగ వలెను. ఆమె హిరణ్య ప్రాకారమున చేరువారి కిక మృత్యువు లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 7 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh

sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻


🌻 552. 'Sarvamrutyu Nivarini' - 7 🌻


Sundara Kanda, Lives of Mahayogis and Sanatsujatiya also explain the nature of death and provide ways to transcend death. As Shrimata is Sarvamrityu Nivarini, in their devotion her worshipers enter into her light. Those who have learned to enter the enclosure of her light will leave the body but will not die in the body. Likewise, there is no premature death or untimely death. In the worship of Sridevi, it should be seeing her divine light in oneself and entering the enclosure of that light. There is no death for those who reach her Hiranya Prakaram.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentários


bottom of page