🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀
🌻 555. 'కలికల్మష నాశినీ'- 3 🌻
దైవమే యిన్ని రూపముల యందున్నాడు. రూపములుగ కూడ నతనే యున్నాడు. సముద్రమే అలగ యున్నది. అన్ని అలలూ సముద్రమే. సముద్రము లేక అల లేదు. అట్లే దైవము లేక తాను లేడు. ఇట్టి భావన మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొనుట వలన అహంకారము కొంచెమై యుండును. అపుడు మమకార మోహాది మలినములు సోకవు. ఎంతటి జ్ఞానికైననూ అజ్ఞాన మలినము సోకవచ్చును. కనుకనే నిత్య అనుష్ఠానము అందరికినీ తప్పని సరి. అనుష్ఠానమున కూడ అహంకారము కలుగుట ముఖ్యము. నిత్యము అనుష్ఠానము గావించు చున్నాను అను అహంకారము కూడ పుట్టవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻
🌻 555. 'Kalikalmasha Nasini' - 3 🌻
God exists in so many forms. He is the same as the forms. The sea itself is the waves. All waves are the ocean. There is no wave without the sea. Similarly, there is no Self without God. Remembering this feeling again and again will reduce the ego. Then the defects of attachment and desire will not affect. No matter how wise, the defect of ignorance can come. That's why regular anushthana or practice is essential for everyone. It is important that ego in anusthana can also occur. Price that one is practicing anusthana regularly.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments