top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 556 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 556 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀


🌻 556. ‘కాత్యాయనీ’ - 2 🌻


శ్రీమాత చైతన్యమే సృష్టికి మూలము. సర్వము నందలి కదలిక, వెలుగు. ఆమెయే అనేకానేక రూపములు ధరించి అనేకానేక శక్తులుగ వ్యాపించును. సృష్టి అంతయూ ఆమె చైతన్యజాలమే. శక్తి జాలమే. కటి ప్రదేశమున అత్యంత కోమలముగ, సున్నితముగ వుండు టకు ఇచ్చగించునది శ్రీమాత. కటి ప్రదేశమున ఓడ్యాణ పీఠమందు కాత్యాయనిగా శ్రీమాత ప్రసిద్ధి చెందినది. కటి ప్రదేశమును సున్నితముగ నుంచుకొనుట యోగమునందు ప్రధానముగ తెలుపబడినది. దేహబంధము నుండి కాత్యాయనీ దేవి విమోచనము కలిగించగల శక్తి స్వరూపిణి.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini

katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻


🌻 556. 'Katyayani' - 2 🌻


Sri Mata's consciousness is the source of all creation, the movement and light within everything. She manifests in countless forms and spreads through various powers. The entire creation is her web of consciousness, her web of energy. Sri Mata is known for her gentleness and delicacy, especially in the waist area, where she is revered as Katyayani at the place of Odyana or bejeweled belt. In yoga, maintaining delicacy in this area is considered important. Katyayani Devi is the embodiment of the energy that can liberate one from the bondage of the body.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentarios


bottom of page