🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 556 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀
🌻 556. ‘కాత్యాయనీ’ - 3 🌻
దేహేంద్రియముల యందాసక్తి కలవారు దేహమున బద్ధులై కటి ప్రదేశము పట్టును కోల్పోవుదురు. మితిమీరిన కోరికల వలన ఇంద్రియార్థముల యందు మానవ ప్రజ్ఞ బంధింపబడి బలమును కోల్పోవును. దేహమందు బంధింపబడును. సన్నని సౌకుమార్యమగు నడుము గల కాత్యాయనీ దేవిని నిత్యమారాధించుట వలన దేహము కొంత వశమగు అవకాశమున్నది. భూమి యందు శ్రీమాత తేజస్సు కాత్యాయనియే. భూమి బంధము నుండి విడిపించునది కూడ ఆమెయే. కాత్యాయనీ దేవి ఓడ్యాణపీఠమందు మిక్కిలి అభిమానము కలిగి యుండునని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 556 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻
🌻 556. 'Katyayani' - 3 🌻
Those who are attached to the body and senses become bound to the body and lose control over their waist area. Due to excessive desires, human wisdom gets entangled in sensory pleasures, leading to a loss of strength and becoming trapped within the body. By regularly worshiping Katyayani Devi, who has a delicate and slender waist, there is a possibility of gaining some control over the body. On Earth, Sri Mata’s radiance is manifest as Katyayani. She is also the one who liberates from the bondage of the Earth. It is important to know that Katyayani Devi is especially revered at the Odyana Peetham or waist area where a bejeweled belt is worn.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários