top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀


🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 2 🌻


శ్రీమాత నారాధించుట వలన కలుగు సర్వశుభములు విష్ణువు ఆరాధన యందు కూడ లభ్యమగును. విష్ణువు మూలము శ్రీలలితయే కదా! మరియొక రహస్య మేమనగా త్రిమూర్తులలో విష్ణువు ఒక్కడే విశ్వమయుడు కాగలిగెను. శ్రీమాత చైతన్యమే విశ్వమయము, సర్వ వ్యాపకము. ఆమె ఆరాధనమున శ్రీ మహావిష్ణువు కూడ సర్వవ్యాపకుడై నిలచెను. విశ్వమయత లేమి వినియు నూరక యుండి రంబుజాసనాదు లడ్డపడక విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడఁ దలంచె. ఈ కమనీయమగు పద్యము భాగవతమున నున్నది.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini

katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻


🌻 558. 'kamalaksha nishevita' - 2 🌻


All the auspiciousness that results from worshiping Sri Mata can also be attained by worshiping Vishnu because the source of Vishnu is indeed Sri Lalita. Another secret is that among the Trimurti, Vishnu alone can pervade the entire universe. Sri Mata's consciousness pervades all and is omnipresent. Through her worship, even Maha Vishnu became omnipresent. A beautiful verse from the Bhagavata illustrates how Lord Vishnu, knowing the omnipresence of Sri Mata, without hesitation or consultation with Brahma or other deities, rushed with deep devotion to rescue Gajendra.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Komentar


bottom of page