top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।

కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀


🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 3 🌻


గజేంద్రుడు సృష్టి మూలము, ఆత్మమూలమునగు తత్త్వము నారాధించెను. ఆ తత్త్వమున కధిదేవత అర్ధనారీ స్వరూపము. అందు శివుడు స్థాణువు. స్థిరముగ నుండవాడు, శ్రీమాత అతని విశ్వచేతన. ఆమె కతడు ఆధారము. ఆమె సృష్టి కాధారము. ఆమె సర్వాత్మిక కూడ. అదే స్థితి యందున్న శ్రీ మహా విష్ణువునకు ఆమె కలిగించిన ప్రేరణ వలన శ్రీ మహా విష్ణువు అకస్మాత్తుగ హుటాహుటిని బయలుదేరి గజేంద్రుని రక్షించెను. శ్రీమాతయే శ్రీ మహా విష్ణువునందు గల సంకల్పశక్తి. ఆమె ప్రేరణ మూలమున తన పరివారమునకు గాని, తన భార్యకు గాని తెలుపకయే హుటాహుటిని గజేంద్ర రక్షణమునకు పూనుకొనెను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini

katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻


🌻 558. 'kamalaksha nishevita' - 3 🌻


Gajendra worshipped the primordial principle, the essence of the soul, which is represented by the form of Ardhanarishvara (half-Shiva and half-Shakti). In this form, Shiva is immovable (Sthanu), and Sri Mata is the universal consciousness, his support, and the foundation of creation. She is also the soul of all. In the same way, when Sri Mata inspired Maha Vishnu, he, without informing his consort or anyone else, hurriedly set out to rescue Gajendra. Sri Mata is the willpower that resides within Maha Vishnu, and due to her inspiration, he embarked on this mission to protect Gajendra without delay.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentários


bottom of page