🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 1 🌻
తాంబూలముతో తృప్తి చెందినది శ్రీమాత అని అర్థము. శ్రీమాత పెదవులు ఎఱ్ఱగ నుండును. దానికి కారణము ఆమె స్వీకరించు తాంబూలమే. తాంబూల స్వీకరణము ఆరోగ్య కారణము. జిహ్వ జాడ్యమును తాంబూలము హరించగలదు. జీర్ణకోశము, జీర్ణావయవము లందలి సమస్త జాడ్యములు నాలుకపై ప్రకటింప బడును. నాలుకను శుభ్రపరచుకొనుట ఆరోగ్యమునకు ప్రధానమగు అంశము. జీర్ణావయవముల అస్వస్థతను నాలుక వ్యక్తపరచు చుండగ నోటి నుండి దుర్గంధము వెలువడుచుండును. నోటి దుర్గంధము అస్వస్థతకు సంకేతము. అట్టి దుర్గంధము నెప్పటికప్పుడు నిర్మూలించు కొనుట సదాచారము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 559. 'Tāmbūlapūrita Mukhi' - 1 🌻
The name "Tāmbūlapūrita Mukhi" means that the Divine Mother is satisfied with tāmbūla (betel leaves). This indicates that the lips of the Goddess Śrī Mātā are naturally red due to the tāmbūla she consumes. The practice of consuming tāmbūla is tied to health benefits. Tāmbūla can remove the lethargy of the tongue. Many internal health issues, especially related to the digestive system, are reflected on the tongue. Cleaning the tongue is an important aspect of health. When the digestive system is unwell, bad breath emanates from the mouth, signaling ill health. Removing bad breath regularly is a mark of good personal hygiene.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments