🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 559 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 559. 'తాంబూలపూరిత ముఖీ' - 2 🌻
తాంబూల చర్వణము దుర్గంధమును పారద్రోలు టయే గాక జిహ్వ జాడ్యములను కూడ నిర్మూలించును. దేహము ఆరోగ్యముగ నుండును. నోరు కూడ సుగంధ మగు వాసనను కలిగి యుండును. భోజనానంతరము తీరికగ తాంబూలమును గొనుట వలన స్వీకరించిన భోజనము సులభముగ జీర్ణమగును. శ్రీమాత దాడిమీ పూరిత ముఖము సాధకులకు ఈ సందేశ మిచ్చును. అంతేకాక శ్రీమాత రతిప్రియ గనుక, సతతము శివునితో కూడి యుండును గనుక ఆమె నోటి సుగంధము శివుని ఆకర్షించి తన కుమ్ముఖము చేయును. స్త్రీలు కూడా పురుషుల నాకర్షించుటకు తాంబూలమును ఒక సాధనముగ వాడుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 559 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 559. 'Tāmbūlapūrita Mukhi' - 2 🌻
Chewing tāmbūla not only eliminates bad breath but also eradicates the sluggishness of the tongue, promoting overall health. It also leaves the mouth fragrant. Consuming tāmbūla leisurely after a meal aids in easy digestion. The Goddess Śrī Mātā, with lips colored like a pomegranate, conveys this message to her devotees. Additionally, since Śrī Mātā is beloved by Śiva and is constantly with him, the fragrance of her mouth attracts Śiva and draws him toward her. Women also use tāmbūla as a means to attract men.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires