🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 561 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 561. 'మృగాక్షీ' - 1 🌻
జింక కన్నుల వంటి కన్నులు కలది శ్రీమాత అని అర్ధము. జింక సాధుజంతువు. జింక చూపులు బిత్తరగ నుండును. అటు నిటు కదులుచు నుండును. అమాయకముగ నుండును. అవి నిత్య చంచలములు. శ్రీమాత కన్నులు కూడ ఈ గుణములు కలిగి యున్నట్లుగ వర్ణింపబడినవి. మాయకు ఆవల యుండును గనుక శ్రీమాత అమాయక. జగన్మాత గావున గోవు వలె సాధువు. చైతన్య స్వరూపుడు గనుక నిత్యమూ కదలిక గలిగి యుండును. శివుడు స్థాణువు, అచంచలుడు. శ్రీమాత చంచల. కదలిక. సృష్టి అంతయూ ఆమె కదలికయే. కదలిక లేనిచో సృష్టియే లేదు. శ్రీ సూక్తమున 'అనపగామినీం' అని వర్ణించిరి. అనగా నిత్యమూ కదలుచున్ననూ, కదలుచున్నట్లు గోచరించదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 561. 'Mrugashi' - 1 🌻
The meaning of this text is that the divine Mother, Shri Mata, is described as having eyes like those of a deer. A deer is a gentle creature, and its gaze is wide-eyed and innocent, constantly moving and filled with curiosity. Shri Mata’s eyes are said to possess these qualities. Since she exists beyond illusion, she is innocent. As the Mother of the Universe, she is gentle like a cow, full of compassion. Being the embodiment of consciousness, she is always in motion. In contrast, Shiva is still and immovable, while Shri Mata is ever-moving, representing the energy of creation. Creation itself is her movement. Without this motion, there would be no creation. In the Shri Suktam, she is described as "Anapagaminim," which means that although she is always moving, it is not easily perceived.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires