🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 564. 'మృడానీ’ - 1 🌻
సుఖము నొసగు శివుని భార్య శ్రీమాత అని అర్ధము. మృడు డనగా శివుడు. మృడానీ అనగా శివుని భార్య. శుభముల నిచ్చువాడు గనుక శివుడని సంబోధించిరి. అతడు పరమ కరుణామయుడు. కరుణకు అతను పెట్టినది పేరు. శీఘ్రముగనే అనుగ్రహించుట, వరములిచ్చుట, క్షమించుట, దయచూపుట ఇట్టి గుణములు మృడ అను శబ్దమున కర్థము. ఇవి అన్నియూ అతని గుణములనగా శ్రీమాతయే. గుణ రహితుడగు శివుని శ్రీమాత యిట్లు ఆవరించి యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 564. 'Mrudani' - 1 🌻
The wife of Shiva, who bestows happiness, is Śrī Māta. "Mṛḍu" refers to Shiva, and "Mṛḍānī" refers to the wife of Shiva, Śrī Māta. Shiva is called the giver of auspiciousness, and because he bestows blessings, he is addressed as "Shiva." He is full of supreme compassion. His name itself is synonymous with compassion. The qualities of swiftly granting grace, bestowing boons, forgiving, and showing mercy are all contained in the word "Mṛḍu." These qualities of Shiva are, in essence, Śrī Māta herself. Śrī Māta envelops and encompasses Shiva, who is beyond all attributes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires