top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 567 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 567 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।

మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀


🌻 567. 'భక్తనిధి’ - 2 🌻


కోరిన వారి కోరికలు వారి వృద్ధికి తోడ్పడునవి అగుచో వానిని పూరించుట, అట్లు కానిచో స్మృతి పథము నుండి తప్పించుట, లేక అట్లు కోరు విషయముల యందు వికర్షణ కలిగించుట చేయుచుండును. భక్తుల కోరికలు తీర్చు విషయమున శ్రీమాత నేర్పు అనుపమానము. భక్తుల వృద్ధిని దృష్టి యందుంచుకొని ఆమె వారిని పరితృప్తులను చేయుచుండును. ఆమె అనిర్వచనీయమైన నిధి వంటిది. అందుండి పొందలేని విషయము సృష్టిలో లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 567 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari

maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻


🌻 567. 'Bhaktanidhi' - 2 🌻


If the desires of the devotees are conducive to their growth, she fulfills them; if not, she diverts their minds away from them or causes a sense of detachment. Śrī Māta has unparalleled wisdom when it comes to fulfilling the desires of her devotees. Keeping their growth in mind, she ensures their satisfaction. She is an indescribable treasure, and there is nothing in the universe that cannot be obtained through her.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comentários


bottom of page