🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 568 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀
🌻 568. 'నియంత్రీ' - 1 🌻
నియంత్రించునది శ్రీమాత అని అర్థము. సృష్టి సర్వమునూ నియంత్రణ చేయునది శ్రీమాతయే. లోకము లకు, లోకపాలురకు, లోకులకు హద్దులు పెట్టుచూ సృష్టిని పాలించును. ఎవరి హద్దులలో వారు ప్రవర్తించునట్లుగ శాసనము చేయును. హద్దులు మీరిన వారిని తగు విధముగ శిక్షణము చేయును. సర్వజీవులకు శిక్షణ నిచ్చుచూ వారి పరిణామ కథను పర్యవేక్షించు చుండును. హద్దు మీరక ప్రవర్తించునట్లు ఏర్పాట్లు చేయును. ఎలుకకు పిల్లి హద్దు. పిల్లికి కుక్క హద్దు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻
🌻 568. 'Niyantri' - 1 🌻
The term 'Niyantri' means the one who controls, and it refers to Shri Mata. Shri Mata is the controller of all creation. She governs the universe by setting boundaries for the worlds, for the guardians of the worlds, and for beings. She establishes laws to ensure that everyone functions within their limits. Those who cross these boundaries receive proper discipline from her. She provides guidance to all living beings, overseeing their evolutionary journey, and ensuring they act within limits.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments