🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 575, 576 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 575, 576 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀
🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 3 🌻
శ్రీమాతను క్రోధము, మాత్సర్యము, లోభము, మోహము, అశుభ భావనలు పారద్రోలు మని వేడుకొనవలెను. నిర్మల హృదయులను గావింపుమని సదా ప్రార్థింప వలయును. అట్టి ప్రార్థనలు ఫలించినపుడు చెట్టు కొమ్మయొక్క రెమ్మనుండి పుష్పము వికసించినట్లు అనాహత చక్రము అనాహత పద్మముగ మారును. అనాహత చక్రముగ నున్నంత కాలము హృదయము వికాసము పొంద జాలదు. జనన మరణములను చక్రము నందు జీవుడు తిరుగాడుచునే యుండును. చక్రములు పద్మములు కావలయును (మార్పు చెంద వలెను). లేనిచో జీవితము అంధకార బంధురమే. అట్టి మార్పు కలుగుటకు దైవీ తత్త్వము నందు భక్తి, ప్రేమ ప్రధానము. పరహిత జీవనము భక్తి వికసించుటకు అనుపానమై నిలచును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 575, 576 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻
🌻 575, 576. 'madhvipanalasa, matta' - 3 🌻
Devotees must also earnestly seek the removal of negative traits like anger, envy, greed, delusion, and inauspicious thoughts. Constant prayer for pure hearts is essential. When these prayers bear fruit, the Anahata Chakra (the heart chakra) transforms into the Anahata Padma (the heart lotus), symbolizing spiritual blooming. As long as the chakra remains closed, the heart cannot blossom, and the soul remains bound to the cycle of birth and death. Chakras must transform into lotuses; otherwise, life remains shrouded in the darkness of ignorance. To bring about such a transformation, devotion (bhakti) and love for the Divine are paramount. Living for the welfare of others (selfless living) acts as nourishment for the growth of devotion.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments