top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

Lalitha Chaitanya Vijnanam 590-1
Lalitha Chaitanya Vijnanam 590-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।

శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀


🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 1 🌻


కోట్ల లక్ష్మీదేవులు శ్రీమాత కటాక్షమునకై కింకరుల వలె సేవల నందించుదురు అని భావము. శ్రీ తత్త్వము నుండి అనేకములగు సృష్టులు యేర్పడుచుండును. ప్రతి సృష్టియందు, ముగురమ్మలలో నొకరుగా లక్ష్మి యుండును. ఆమెయే అష్టలక్ష్మిగ వ్యాప్తి చెందును. ఇట్లెందరో లక్ష్ము లుందురు. అందరునూ శ్రీమాత సేవికలే. శ్రీమాతయే వారి రూపములలో అనేకానేక లోకములలో సుఖానుభూతి నిచ్చుచుండును. వారందరికిని పుట్టుక స్థానము శ్రీమాతయే గనుక లక్ష్ము లందరును శ్రీమాతను సేవించి ఆమె కటాక్షము పొందుచుందురని ఈ నామార్థము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita

Shirasdhita chandranibha phalasdhendra dhanuh prabha ॥119 ॥ 🌻


🌻 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 1 🌻


The meaning conveyed here is that countless forms of Goddess Lakshmi serve Sri Mata (Divine Mother) like attendants to receive Her divine grace. From the Supreme Truth (Sri Tattva), numerous creations emerge, and in every creation, Goddess Lakshmi exists as one among the three Divine Mothers. She expands in the form of Ashta Lakshmis (Eight Lakshmis), and thus, there are innumerable Lakshmis. However, all of them remain as servitors of Sri Mata. Sri Mata, through Her infinite forms, bestows joy and bliss in countless worlds.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page