
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 591 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 591 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀
🌻 591. ‘శిరస్థితా’- 2 🌻
ఆమె శివుని నుండి వ్యక్తమై సంకల్ప రూపము ధరించి జ్ఞానమై ప్రకాశించుచు క్రియాశక్తిగ సృష్టిని నిర్మాణము చేయుచున్ననూ శివ స్థానమును, శిరోస్థానమును వీడదు. ఇట్లు పరతత్వము నుండి స్థూల లోకము వరకు వ్యాప్తిచెందునే గాని అవరోహణమున శివుని వీడుట యుండదు. సూర్యకిరణము సూర్యుని నుండి భూమి వరకు వ్యాప్తిచెంది సూర్యుని వద్దనూ, భూమిపైననూ, ఈ రెంటి నడుమ గల చోటు యందునూ గూడ యున్నది కదా! శ్రీమాత గమనమున వ్యాపన ముండును గాని స్థల మార్పు యుండదు. కావున ఆమె శిరస్థ్సిత.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 591 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasdhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻
🌻 591. 'Shira sthita' - 2 🌻
She manifests from Shiva, taking the form of divine will (Sankalpa) and radiating as pure knowledge. While creating the universe through Her dynamic energy (Kriya Shakti), She never departs from Shiva’s abode—the crown center (Shirosthana). Her presence extends from the supreme transcendental reality (Paratattva) down to the material world, yet even in this descent, She never separates from Shiva. Just as the rays of the sun extend from the sun to the earth, yet remain present in the sun, on earth, and in the space between, Sri Mata pervades all levels without undergoing any spatial movement. Thus, Her presence is expansive, but She does not change Her location—hence, She is ever established in the crown (Shirasthita).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments