శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1
- Prasad Bharadwaj
- Mar 14
- 2 min read

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀
🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 1 🌻
ఇంద్ర ధనుస్సు వలె ఫాల భాగమున ప్రకాశించునది. ఇంద్ర ధనుస్సు శ్రీమాత యొక్క సప్త వర్ణముల సౌందర్య రూపము. ఫాలమున గల విద్యుత్ కాంతి ఆధారముగ ఏడు వర్ణముల కాంతి ప్రకాశించును. ఏడు లోకములకు మూలమై ప్రకాశించు ఫాల భాగము ఏడు వర్ణములతో కూడి యుండును. క్రమముగ ఈ కాంతులే అవరోహణ క్రమమున దేహ నిర్మాణము, సృష్టి నిర్మాణము కూడ చేయును. ఫాలభాగము నందలి ఆజ్ఞా కేంద్రము ఉపరితలమున ధనుస్సుగా విప్పారి మనోహరమై శ్రీమాత విద్యుత్ కాంతులు గోచరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻
🌻 594. 'Indhendra dhanuh prabha' - 1 🌻
Like a rainbow, the forehead region (Phāla Bhāga) radiates brilliantly. The rainbow represents the sevenfold beauty of Śrī Māta’s divine hues. The electric light within the forehead serves as the foundation for the manifestation of these seven colors. The Phāla Bhāga, which is the source of illumination for the seven worlds, consists of these seven hues. In a descending order, these radiances contribute to the formation of the human body and the structure of creation itself. The Ājñā center (the third eye region) expands outward in the form of a radiant bow, revealing the divine electric glow of Śrī Māta.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments