top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 2

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 17
  • 2 min read

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।

దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀


🌻 595. 'హృదయస్థా' - 2 🌻


హృదయ ప్రవేశము చేసినగాని సత్యమగు దర్శనములు లభ్యము కావు. హృదయమందు శ్రీమాత బాలసూర్య ప్రభలతో ప్రకాశించు చుండును. ఎరుపు బంగారము, పసుపు బంగారము వలె కాంతులీను చుండును. పసుపు కుంకుమలతో పూజలు గావించుచూ పచ్చని బంగారపు కాంతిగల శ్రీమాత ముఖమును ధారణ చేసి ఆరాధన సాగించవలెను. ఇట్లు దీర్ఘకాలము ఆరాధన చేయగ చిత్తము ఏకోన్ముఖమై ధారణము చేయుటకు సహకరించును. శ్రీమాత రూపమునట్లు ధారణచేసి ఆమె సమీపమునకు తాను చేరువగుచున్నట్లు కూడ భావన చేయవలెను. అట్టి సమయమున సాధకుని ప్రజ్ఞ క్రమముగ బుద్ధి ప్రవేశము చేయును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika

Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻


🌻 595. 'Hrudayasdha' - 2 🌻


Without entering the heart, true divine visions cannot be attained. Within the heart, Śrī Māta radiates with the brilliance of the rising sun, shining like red and yellow gold. Worship should be performed using turmeric and kumkum while meditating upon Śrī Māta’s face, which glows with the radiance of fresh golden light. Through prolonged and dedicated worship, the mind becomes single-pointed and supports deeper meditation. One should hold Śrī Māta’s form in their mind and feel as though they are moving closer to Her divine presence. At this stage, the seeker’s wisdom gradually deepens, leading to the awakening of higher intelligence (buddhi).



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page