top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 20
  • 2 min read

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।

దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀


🌻 596. 'రవిప్రఖ్యా’ - 1 🌻


సూర్యకాంతులవలె ప్రకాశించునది. హృదయము సూర్యమండల కాంతులతో ప్రకాశించును. ఫాలము సవితృ మండల కాంతులతో ప్రకాశించును. శిరస్సు భర్గోదేవ మండల కాంతులతో ప్రకాశించును. మూలాధారము భూమండల కాంతులతో ప్రకాశించును. ఇవి వరుసగా మేషము, సింహము, ధనుస్సు రాశుల కాంతులుగ జ్యోతిర్విద్య తెలుపును. శిరస్సు, ఫాలము మేషరాశి కాంతులు, అవి విద్యుత్ కాంతులు. హృదయము సింహరాశి కాంతులు. అవి సూర్యకాంతులు. మూలాధారము ధనుర్ కాంతులతో నిండును. అవి పదార్థము నందుండు అగ్నికాంతులు. లలితా సహస్రమున నాలుగు స్థితులలో ఈ కాంతుల అవరోహణము తెలుప బడుచున్నది. ఇవి ప్రధానముగ త్రేతాగ్నులు.




సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika

Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻


🌻 596. 'Ravi Prakhya' - 1 🌻


It shines like the radiance of the sun. The heart glows with the light of the solar realm. The forehead radiates with the brilliance of the Savitr̥ realm. The head is illuminated by the light of the Bhargo Deva realm. The Mūlādhāra (root chakra) shines with the light of the earthly realm. According to Jyotirvidya (the science of divine light), these correspond sequentially to the luminosities of Aries (Meṣa), Leo (Siṃha), and Sagittarius (Dhanuṣ). The head and forehead radiate the light of Aries, which is electric in nature. The heart radiates the light of Leo, which is solar. The Mūlādhāra is filled with the light of Sagittarius, which manifests as the fiery radiance within matter. In the Lalitā Sahasranāma, the descent of these lights across the four levels is described. These primarily represent the three sacred fires (Tretāgnis).



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page