top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1

Writer: Prasad BharadwajPrasad Bharadwaj


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।

దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀


🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 🌻


త్రికోణము మధ్యన వెలుగొందు కాంతి శ్రీమాత అని అర్థము. మూలాధార పద్మము మధ్యగల కర్ణిక త్రికోణ రూపమున నుండును. అచ్చట త్రికోణ పీఠమునందు దీపము వలె ప్రకాశించునది శ్రీమాత. దీపమువలె అనగా జ్వాలవలె అని తెలియవలెను. ఇచ్చట కేవలము బిందువువలె కాంతివంతమై యుండు కుండలినీ శక్తి. పదార్థమునందు వెలుగొందునవి, భూమినందు వెలుగొందునవి, భూమికయై, భూమికాధారమై యుండును. మన శరీరమున కిదియే ఆధారము. స్థూల శరీరము నందు జీవుడు వసించి యున్నప్పుడు మూలాధారమున త్రికూటమందు బంధింపబడి యుండును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika

Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻


🌻 597. 'Trikonantara Dipika' - 1 🌻


The light that shines in the middle of the triangle signifies Śrī Mātā. This refers to the triangular form present in the center of the Mūlādhāra Padma (root chakra). In that place, within the triangular seat, Śrī Mātā shines like a lamp. The phrase "like a lamp" should be understood as "like a flame." Here, Kuṇḍalinī Śakti remains as a radiant point of light. It is the source of illumination in matter, on the earth, and exists as both the foundation and the support of the earth. It is also the fundamental support of our body. When the Jīva (individual soul) resides in the gross body, it remains bound within the threefold structure of the Mūlādhāra.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page