top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలిత దేవి జయంతి శుభాకాంక్షలు Greetings on Sri Lalitha Devi Jayanthi



🌹. శ్రీ లలిత దేవి జయంతి శుభాకాంక్షలు Sri Lalitha Devi Jayanthi Greetings to All 🌹


🪷 ప్రసాద్‌ భరధ్వాజ


🌹లలిత జయంతి యొక్క ప్రాముఖ్యత 🌹


ప్రతి సంవత్సరం , మాఘ మాసం పూర్ణిమలో లలిత జయంతి ఉపవాసం పాటిస్తారు. లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు , శాంతి , శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు. వీటితో పాటు , ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధిలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజున కొన్ని ప్రదేశాలలో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో , భక్తులు శ్రీ లలితదేవి ఆశీర్వాదం పొందడానికి క్యూలలో వేచి ఉంటారు. లలితాదేవితో పాటు , స్కందమాత మరియు శంకరుల లను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది. లలితా మాతను రాజేశ్వరి , షోడాషి , త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారు. లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి , ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు.



ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత , పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.



‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ , యాగాలూ , పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి , ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే... ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ , శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహా యాగం చేశారు. ఆ హోమ గుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి , శ్రీచక్రాన్ని అధిష్ఠించి , భండాసురుణ్ణి సంహరించింది.



ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు , మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే ‘శ్రీ లలితా సహస్రనామం’గా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి.



సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’ న్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ , పాశాన్నీ , అంకుశాన్నీ , పుష్పబాణాలనూ , ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి , శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి , లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ , కళల్లో ప్రావీణ్యాన్నీ , కుటుంబ సౌఖ్యాన్నీ , ప్రశాంతతనూ , సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి , శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున... పవిత్ర స్నానాలు చేసి , లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ , అలాగే ‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం...’ అంటూ ప్రారంభమయ్యే ‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’ పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట.



సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు.



మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.



🌹🌹🌹🌹🌹





🌹. Sri Lalitha Devi Jayanthi Greetings to All 🌹

🪷 Prasad Bharadwaja


🌹Significance of Lalitha Jayanti 🌹


Every year, Lalitha Jayanti fast is observed on Purnima in the month of Magha. Devoted worshiper of Goddess Lalita takes steps towards peace, prosperity and salvation. Apart from these, this fast helps in achieving all kinds of siddhis. Many great festivals are held on this day in some places. In temples, devotees wait in queues to seek the blessings of Sri Lalita Devi. Along with Lalita Devi, the tradition of honoring Skandamata and Shankara is also followed on this day. Lalita Mata is known as Rajeshwari, Shodashi and Tripura Sundari. As Lalita Devi is an incarnation of Parvati, she is also known as Tantric Parvati.

Srilalitha Tripurasundari is the second form of Tripuratrayam, the forms of Adishakti. She is the presiding deity of Srichakra, panchadasakshari is the presiding deity. Legend has it that Sri Lalita Devi appeared on the full moon of Magha to kill Bhandasura.

'Maghamu' means Yajna. Elders consider the month of Magha as the best month for performing Yajna, sacrifices and sacred divine works. The most special day in such Magha month is Magha Poornami. This is also known as 'Maha Maghi'. According to science, bathing in the sea, river and worshiping on this day will give immense results. Another special feature of Magha Poornami is that Lalita Jayanti is also the same day. The origin story of Devi Lalita is mentioned in Devi Purana. A demon called Bhandasura did penance for Lord Shiva. Appreciated by his devotion, Lord Shiva appeared. Bhandasura asked for a boon that if someone fights with him... half of that opponent's strength will come to him and he will not be harmed by the weapons of the enemy. Lord Shiva granted that boon. Bursting with pride, Bhandasura along with his brothers started tormenting the three worlds. Unable to bear the pains he inflicts... Indra's devas worshiped Srimata as instructed by Narada. A great sacrifice was made. Ammavaru emerged as Sri Lalita Devi from that Homa Gundam, mounted the Sri Chakra and killed Bhandasura.

The Naams chanted by the Devas and Munus to appease her Raudra form became popularly known as 'Sri Lalita Sahasranamam'. Kameshwar was transformed into Lalita Devi. Puranas state that they are the ones who manage all creation.

Goddess Lalita is worshiped as the source of all powers. That's why... in whatever form Goddess is worshiped, 'Lalita Sahasranama' is recited. Shining in the color of Aruna, she appears carrying pasha, ankusha, flower arrows and bow in her four hands. Sri Lalita Devi is regarded as the mother who dispels fear and bestows peace. It is the belief of the devotees that if one worships her who withdraws her raudra form with the prayers of the deities and recites Lalitasahasranama... she will spread her compassionate attention on the devotees, will bestow mastery in arts, family comfort, peace and wealth. In particular, on the Magha Purnami day of Sri Lalita Devi's birthday, taking holy baths and worshiping the Goddess by reciting Lalita Sahasranama will bring abhishta siddhi, and recitation of 'Sri Lalitha Pancha Ratna Stotra' which begins with 'Pratahsmarami Lalita Vadanaravindam...' is also a special fruit.

Goddess Lalita is worshiped as the source of all powers. That's why... in whatever form Goddess is worshiped, 'Lalita Sahasranama' is recited.

Magha full moon is the most special day in Magha month. This is also known as 'Maha Maghi'. According to science, bathing in the sea, river and worshiping on this day will give immense results. Another special feature of Magha Poornami is that Lalita Jayanti is also the same day.

🌹🌹🌹🌹



Comentários


bottom of page