🌹 . శ్రీ శివ మహా పురాణము - 890 / Sri Siva Maha Purana - 890 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴
🌻. శంఖచూడ వధ - 5 🌻
విష్ణువు వైకుంఠముకు వెళ్లెను. శ్రీ కృష్ణుడు స్వస్థుడాయెను. దేవతలు పరమానందముతో గూడిన వారై తమ నెలవులకు వెళ్లిరి (36). జగత్తు మిక్కిలి స్వస్థతను పొందెను. భూమియందు విఘ్నములన్నియు శమించెను. ఆకాశము నిర్మలమాయెను. భూమియందు అంతటా మంగళములు నెలకొనెను (37).
ఈ తీరున ఆనందదాయకము, దుఃఖములనన్నిటినీ పోగొట్టునది, సంపదల నిచ్చునది, కోర్కెల నన్నిటినీ ఈడేర్చునది యగు మహేశుని వృత్తాంతమును చెప్పియుంటిని (38). ధన్యము, కీర్తికరము, ఆయుర్వర్ధనము, విఘ్నములనన్నిటినీ తొలగించునది, భుక్తి ముక్తులను సర్వకామములను ఇచ్చునది (39). అగు ఈ చంద్రశేఖరుని గాథను బుద్ధిశాలియగు ఏ మానవుడు నిత్యము వినునో, లేదా వినిపించునో, లేదా పఠించునో, లేదా పఠింపజేయునో (40), అట్టివాడు ధనధాన్యములను, పుత్రుని, సౌఖ్యమును, సర్వకామనలను, విశేషించి శివభక్తిని పొందుననుటలో సందియములేదు. (41). ఈ సాటిలేని గాథ ఉపద్రవములనన్నిటినీ నశింపజేసి పరమజ్ఞానమునిచ్చి శివభక్తిని వర్ధిల్లజేయును (42). దీనిని విన్న బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్విగను, క్షత్రియుడు విజయిగను, వైశ్యుడు సంపన్నుడు గను, శూద్రుడు మహాపురుషుడుగను అగుదురు (43).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడవధయను నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 890 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴
🌻 Śaṅkhacūḍa is slain - 5 🌻
36. Viṣṇu went to Vaikuṇṭha. Kṛṣṇa became complacent. The gods went to their abodes with great delight.
37. The universe regained normalcy. The whole earth was freed of obstacles. The sky was pure. The whole world became auspicious.
38. Thus I have narrated to you the delightful story of lord Śiva that removes all misery, yields wealth and fulfils cherished desires.
39. It is conducive to prosperity and longevity. It prevents all obstacles. It yields worldly pleasure and salvation. It confers the fruits of all cherished desires.
40-41. The intelligent man who hears or narrates the story of the moon-crested lord, or reads or teaches it shall undoubtedly derive wealth, grains, progeny, happiness, all desires and particularly devotion to Śiva.
42. This narrative is unequalled. It destroys all torments. It generates great knowledge. It increases devotion to Śiva.
43. The brahmin listener attains brahminical splendour; the Kṣatriya becomes a conqueror; the Vaiśya rich and the Śūdra the most excellent of men.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments