top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్ధిదాయినీ Siddhidayini


శ్రీ దేవి శరన్నవరాత్రులు 9వ రోజు 11/10/2024 "దేవీ సిద్ధిదాయినీ " గా దర్శనం - శ్రీ శైలం


🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃


శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||


"దేవీ సిద్ధిదాయినీ" ధ్యాన శ్లోకం


శ్లో𝕝𝕝 సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||


సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.


ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథము లన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజా దికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానంద దాయకమైన అమృతపదము ప్రాప్తించును.



శ్రీ సిద్ధిదాయినీదేవ్యై నమః


💙💙💙💙💙💙💙💙💙💙💙💙


Comments


bottom of page