🌹హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. Good Wishes on Hanuman Jayanti and Chaitra Pournami to All 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 చైత్ర పూర్ణిమ - అదృష్ట పౌర్ణమి 🌹
🌳 పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది. కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చైత్రం మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథినే చైత్ర పూర్ణిమ అని అంటారు. తెలుగు సంవతర్సంలో చైత్రం మొదటి నెల కాబట్టి దీన్నే చంద్రమాసం అని కూడా అంటారు. చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసముండటం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
🌳 చైత్ర పూర్ణిమ మహిమ..
పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధివిధానంతో పూజలు చేయడంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. చంద్రుడికి వ్రతం చేయడం వల్ల కావాల్సిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తారు.ఈ రోజు గంగానదిలో స్నానం చేయడం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు.పురాణాల ప్రకారం ఈ రోజు తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చని ప్రస్తావించారు.
🌳చైత్ర పూర్ణిమ వ్రత విధానం..
ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు. ఇదే నియమం చైత్ర పూర్ణిమలోనూ వర్తిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ద్వారా ఉపవాసవ్రతమాచరించాలి. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇందుకోసం మీకు కనకధర స్తోత్రం పఠించవచ్చు. అనంతరం రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించాలి. అనంతరం బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయాలి. లేదా పేదవ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని చెబుతారు.
🌳 చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తారు. రామాయణం లేదా భాగవత కథను వినలేనివారు ఈ రోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు. పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి.
🌳 చైత్ర పూర్ణిమకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
ప్రతి పూజా మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్నే పౌర్ణమి అంటారు. దీనర్థం చీకటిపై కాంతి విజయం సాధించడం. అంటే చెడుపై మంచి విజయం సాధించడం అని అంటారు.
🌹🌹🌹🌹🌹
Comments