1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 02, శనివారం, జూలై 2022 స్థిర వాసరే Saturday 🌹
2) 🌹 కపిల గీత - 32 / Kapila Gita - 32🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 72 / Agni Maha Purana - 72🌹
4) 🌹. శివ మహా పురాణము - 588 / Siva Maha Purana - 588🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 207 / Osho Daily Meditations - 207🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-3🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹02, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 3 🍀*
*5. నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |*
*నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే*
*6. సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |*
*అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జగత్తులో ఉండే సమస్త దుఃఖములకు మూడే కారణములు - అజ్ఞానం, అసక్తత, అభావము. గాయత్రి యొక్క త్రిపదా రూపము ఈ మూడు కారణములను చెరిపేస్తుంది. - సద్గురు శ్రీరామశర్మ. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల తదియ 15:18:40 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: ఆశ్లేష 30:31:21 వరకు
తదుపరి మఘ
యోగం: హర్షణ 11:33:59 వరకు తదుపరి వజ్ర
కరణం: గార 15:15:39 వరకు
వర్జ్యం: 18:07:08 - 19:53:24
దుర్ముహూర్తం: 07:30:46 - 08:23:22
రాహు కాలం: 09:02:49 - 10:41:27
గుళిక కాలం: 05:45:34 - 07:24:12
యమ గండం: 13:58:41 - 15:37:19
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 28:44:44 - 30:31:00
మరియు 30:06:42 - 31:51:34
సూర్యోదయం: 05:45:34
సూర్యాస్తమయం: 18:54:33
చంద్రాస్తమయం: 21:33:55
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మానస యోగం - కార్య లాభం
30:31:21 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 32 / Kapila Gita - 32🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 2 🌴*
*32. శ్రీభగవానువాచ*
*దేవానాం గుణలిఙ్గానామానుశ్రవికకర్మణామ్*
*సత్త్వ ఏవైకమనసో వృత్తిః స్వాభావికీ తు యా*
*మన ప్రవృత్తికీ, నివృత్తికీ మూలం మన మనస్సు. మనసునూ జ్ఞ్యాన కర్మేంద్రియాలను సత్వము యందు ఉంచు. ఇలా ఈ మూడిటినీ పరమాత్మ యందు లగ్నం చేసి, సాంసారిక ప్రవృత్తిని మానేస్తే, పరమాత్మ మన వశం అవుతాడు. అలా కావడాన్ని, పరమాత్మ యందు ఉండే అనిమిత్తమైన భక్తి అంటారు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 32 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 14. Bhakti as Ultimate Liberation - 2 🌴*
*32. sri-bhagavan uvaca*
*devanam guna-linganam anusravika karmanam*
*sattva evaika-manaso vrttih svabhaviki tu ya*
*Lord Kapila said: The senses are symbolic representations of the demigods, and their natural inclination is to work under the direction of the Vedic injunctions. As the senses are representatives of the demigods, so the mind is the representative of the Supreme Personality of Godhead. The mind's natural duty is to serve. When that spirit of service is engaged in devotion to the Personality of Godhead, without any motive, that is far better than salvation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 72 / Agni Maha Purana - 72 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 25*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 4 🌻*
ధీ, అహంకారము, మనస్సు, శబ్ధము, స్పర్శ - రూప - రసములు - గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందను, దేహమునందును విన్యసించవలెను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, సుఖము, హృదయము, నాభి, గుహ్యప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహుడని చెప్పబడినాడు.
జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్ధము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు నావాత్మకుడు. అంగష్ఠద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జనిమొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దహముపై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను.
దశాత్మకు డగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరోలలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. మనః శ్రోత్ర, చక్షుర్, జిహ్వా, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థరూపమున ఏకాదశాత్మరు డగు ఈ జీవుని శ్రోత్రమునందను, అంగుష్ఠ ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయమునందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము.
అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా, (పిక్కలు) గుల్ఫ (చీలమండలు), పాదములపై విన్యసించవలెను.
విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుని అని ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్ఠాదులందును, తలాదులందును, పాదమునందును, జానువునందను, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, వాదము మొదలైన వాటియందును విన్యసించవలెను. పంచవింశవ్యూహములు కలవాడును, షడ్వింశవ్యూహములు కలవాడును, ఎట్లనగా,
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 72 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 25*
*🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 4 🌻*
29-32. Atirātra[9] and Aptoryāma[10] (rites will also be described). The soul of the sacrifice which has seven forms extending to the intellect, ego, mind, sound, touch, colour, taste, smell, comprehension, should be assigned duly to the fingers and the body. A person has to assign it to the teeth, palms, head, forehead, face, heart, navel, the generative organ and the feet. These are remembered as the eight Vyūhas (parts). The life which consists of nine parts—life, intellect, ego, mind, sound, quality, wind, colour, and taste, is assigned to two thumbs. They (are placed) in order on the left hand by means of the forefinger and other fingers.
33. Indra remains pervading the ten (limbs) consisting of body, head, forehead, mouth, heart, navel, the generative organ, two knees and feet.
34-35. The fire (is assigned) to two thumbs. Mind consisting of eleven parts—ear, skin, eye, tongue, smell, speech, hand, foot, anus is assigned to head, forehead, face, heart, navel, the generative organ, two knees and feet with the forefinger.
36. The mind is made to pervade the male organ. The two thumbs (are made to pervade) the ear. Commencing with the fore-finger in order, the eight fingers (are assigned). The (two fingers) left over are assigned to palm.
37. The head, forehead, month, heart, navel (are assigned) in order to generative organ, two thighs, shanks, ankles and feet.
38-39. Viṣṇu, Madhuhara (killer of the demon Madhu), Trivikrama, Vāmana, Śrīdhara, Hṛṣīkeśa, Padmanābha, Dāmodara, Keśava, Nārāyaṇa, Mādhava, Govinda (are the names of Viṣṇu). Viṣṇu is made to pervade.
40. The thumb (and other fingers), palms, feet, two knees, waist are assigned to head, crown of head, waist, knees. and feet.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 588 / Sri Siva Maha Purana - 588 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴*
*🌻. కార్తికేయుని లీలలు - 1 🌻*
నారదుడిట్లు పలికెను-
ఓ దేవదేవా! ప్రజాపతీ! బ్రహ్మా! సృష్టిని చేయు ప్రభూ! తరువాత ఏమాయెను? దయయుంచి అచటి విశేషములను ఇపుడు చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
కుమార ! ఆ సమయములో ప్రతాపశాలియగు విశ్వామిత్రుడు విధిచోదితుడై అనుకోకుండగా అచటకు ఆనందముతో విచ్చేసెను (2). తేజశ్శాలియగు శివపుత్రుని అలౌకిక ప్రకాశమును గాంచి ఆయన ఆనందముతో నిండిన హృదయము గలవాడై ప్రసన్న చిత్తముతో నమస్కరించెను (3). ఆ బాలుని ప్రభావము నెరింగిన విశ్వామిత్రుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై విధిచోదితములగు వాక్కులతో ఆ బాలకుని స్తుతించెను (4).
అపుడా బాలకుడు అచట మిక్కిలి ప్రన్నుడై అనేక లీలలను ప్రదర్శించెను. ఏమి అశ్చర్యము! అద్భుతము. ఆ శివసుతుడు బిగ్గరగా నవ్వి విశ్వమిత్రునితో నిట్లనెను (5).
శివసుతుడు ఇట్లు పలికెను -
ఓ మహాజ్ఞానీ! నీవు శివుని ఇచ్చచే ఇచటకు అకస్మాత్తుగా విచ్చేసితివి. తండ్రీ! నాకు వేదవిహితమగు సంస్కారమును యథావిధిగా చేయుము (6) ఈ నాటి నుండియూ నీవు నాకు పురోహితుడవై ఆనందమును కలిగించుము. నీవు అందరికీ పూజ్యుడవు కాగలవు. ఈ విషయములో సందేహము లేదు (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ బాలకుని మాటలను విని మిక్కిలి అశ్చర్యమును, ప్రసన్నతను పొందిన గాధికుమారుడగు విశ్వామిత్రుడు మెల్లగా ఆ బాలకునితో నిట్లనెను (8).
విశ్వామిత్రుడిట్లు పలికెను -
కుమారా ! వినుము. నేను విప్రుడని కాను క్షత్రియుని కుమారుడను. నేను విశ్వామిత్రుడని ప్రసిద్ధిగాంచిన క్షత్రియుడను. విప్రులను సేవించువాడను (9) . ఓ శ్రేష్ఠ బాలకా! నేను నీకు నా చరిత్ర నంతనూ చెప్పియుంటిని. నీవెవరివి? నాకాశ్చర్యము కలుగుచున్నది. నాకు నీ చరిత్రను పూర్తిగా చెప్పుము (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 588 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴*
*🌻 The boyhood sports of Kārttikeya - 1 🌻*
Nārada said:—
1. O lord of subjects, O Brahmin, O creator, what happened thereafter? Please tell me the same.
Brahmā said:—
2. O dear, then the powerful sage Viśvāmitra, urged by Brahmā, came there casually and was delighted.
3. On seeing the unearthly splendour of that brilliant boy, he became very delighted. He bowed to the boy.
4. With a delighted mind he eulogised him with the words prompted by Brahmā. Viśvāmitra realised his power.
5. The boy too was delighted and became the source of great enjoyment. Laughingly he spoke to Viśvāmitra. It was very surprising.
Śiva’s son said:—
6. “O great one of perfect wisdom, it is due to the will of Śiva that you have come here by chance. O dear, perform my purificatory rites in accordance with Vedic injunctions.
7. From now onwards you remain my priest conferring your love on me. It is certain that you will become the object of worship of all.”
Brahmā said:—
8. On hearing his words, Gādhi’s son[1] (Viśvāmitra) was highly delighted and surprised. He spoke to him in a tone, by no means highly accented.
Viśvāmitra said:—
9. Listen, O dear, I am not a brahmin. I am a Kṣatriya, son of Gādhi, famous as Viśvāmitra and a servant of brahmins.
10. O excellent boy, I have thus narrated my life to you. Who are you? Now mention everything about your life to me who am surprised.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 207 / Osho Daily Meditations - 207 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 207. అవును అని చెప్పండి 🍀*
*🕉. జీవితానికి అవును అని చెప్పండి; వీలైనన్ని ఎక్కువ సార్లు వద్దు, కాదు అనే మాటని వదలండి. మీరు వద్దు అని చెప్పవలసి వచ్చినా, చెప్పండి, కానీ చెప్పి ఆనందించకండి. సాధ్యమైతే దానిని అవును రూపంలో కూడా చెప్పండి. జీవితానికి అవును అని చెప్పే ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. 🕉*
*మీరు అవును అని చెప్పినప్పుడు, గొప్ప వేడుక మరియు ఆనందంతో చెప్పండి. దానిని పోషించు; అయిష్టంగా చెప్పకు. ప్రేమగా చెప్పండి, ఎంతో ఉత్సాహంతో చెప్పండి; దానిలో మిమ్మల్ని మీరు పూర్తిగా నింపుకోండి. మీరు అవును అని చెప్పినప్పుడు, అవును అవ్వండి! వంద కాదు, వద్దు అనే మాటలలో తొంభై తొమ్మిది చాలా సులభంగా రాలిపోతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.*
*మనం వాటిని మన అహంలో భాగంగా మాత్రమే చెబుతాము; అవి అవసరం లేదు, అనివార్యం కాదు. మిగిలి ఉన్నది చాలా ముఖ్యమైనది; అవును అనే దానిని వదల వలసిన అవసరం లేదు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే కాదు అని చెప్పేటప్పుడు కూడా, మీరు చాలా అయిష్టంగా, చాలా సంకోచించవలసి ఉంటుంది. ఎందుకంటే కాదు అంటే మరణం మరియు అవును అంటే జీవితం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 207 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 207. SAY YES 🍀*
*🕉. Say yes to life; drop as many no's as possible. Even if you have to say no, say it, but don't enjoy saying it. And if it is possible, say it also in the form of yes. Don't miss a single opportunity of saying yes to life. 🕉*
*When you say yes, say it with great celebration and joy. Nourish it; don't say it reluctantly. Say it lovingly, say it with enthusiasm, with zest; pour yourself into it totally. When you say yes, become yes! You will be surprised to know that ninety-nine out of a hundred no's can be dropped very easily.*
*We say them only as part of our ego; they were not needed, they were not inevitable. The one no that remains will be very significant; that one need not be dropped. But even when saying that essential no, one has to be very reluctant, very hesitant, because no is death, and yes is life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*
*🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 3🌻*
*ఇటీవలి కాలమున రహస్తర్పణ తర్పిత మార్గమును అవలంబించిన వారిలో శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవింద మహర్షి, షిరిడీ సాయిబాబా, మాస్టర్ సి.వి.వి., శ్రీ సత్యసాయి మాస్టర్ ఇ.కె. ముఖ్యులు. బాబా, జీవులు దైవమునకు తమను తాము సమర్పించుకొనుటలో చాల వ్యత్యాస ముండును. బహుకొద్దిగ తమను తాము సమర్పణ చేయువారుందరు. తమకున్నవి సమర్పణ చేయుట నుండి తమను తాము సమర్పణ చేసుకొనుట వరకు మార్గ మున్నది.*
*తమకున్న దానిలో కొద్దో గొప్పో ఇతరుల శ్రేయస్సు కొరకై సమర్పణ చేయుట చాలమంది చేయుదురు. తమకున్న దానిని అంతయూ సమర్పణ చేయువారు హరిశ్చంద్రాదుల వంటివారు. తమనే సమర్పణ చేసుకొనువారు అరుదు. ప్రహ్లాదుడు, నారదుడు, అంబరీషుడు, శిబి, బలి, తమను తాము అర్పణము చేసుకొన్న మహాత్ములు. అట్టివారు శాశ్వతులై భాగవత దేహములతో జీవులకు స్ఫూర్తి నిచ్చుచున్నారు. అట్టి వారందరికిని శ్రీమాతయే మార్గదర్శి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*
*🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -3 🌻*
*There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive). The oblations consist of the thirty six tattva-s or the principles that are responsible for our karma-s, either good or bad.*
*In Śrī vidyā navāvaraṇa pūjā there is one separate ritual called ‘internal oblation’ or tatvaśodhana wherein all the dualities are sacrificed as oblations in the internal fire.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments