🌹🍀 03 - OCTOBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03,సోమవారం, అక్టోబరు 2022 ఇందు వాసరే MONDAY 🌹
*🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🌹*
ప్రసాద్ భరద్వాజ
2) 🌹 కపిల గీత - 72 / Kapila Gita - 72 🌹 సృష్టి తత్వము - 28
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 246 / Osho Daily Meditations - 246 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹03, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూ
లించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, సంధి పూజ, Durga Ashtami, Sandhi Puja🌻*
*🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀*
*ఓం హ్రీం దుం దుర్గాయై నమః*
*విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః*
*అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.*
*త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ |*
*స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : శాశ్వత్వంలో చిన్న, పెద్ద తరగతులున్నాయి. ఏలనంటే శాశ్వత్వమనేది ఆత్మ సంబంధమైన భావం. అది కాలం లోపలా వుండగలదు, కాలాతీతంగానూ వుండగలదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-అష్టమి 16:39:02 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: పూర్వాషాఢ 24:25:09
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శోభన 14:22:12 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: బవ 16:37:02 వరకు
వర్జ్యం: 10:53:48 - 12:23:56
దుర్ముహూర్తం: 12:28:55 - 13:16:43
మరియు 14:52:19 - 15:40:06
రాహు కాలం: 07:36:10 - 09:05:47
గుళిక కాలం: 13:34:39 - 15:04:16
యమ గండం: 10:35:25 - 12:05:02
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28
అమృత కాలం: 19:54:36 - 21:24:44
సూర్యోదయం: 06:06:33
సూర్యాస్తమయం: 18:03:30
చంద్రోదయం: 13:09:25
చంద్రాస్తమయం: 00:22:49
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య
నాశనం 24:25:09 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🌹*
ప్రసాద్ భరద్వాజ
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 72 / Kapila Gita - 72🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 28 🌴*
*28. యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరమ్|*
*శారదేందీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః॥*
*ఈ మనస్తత్వమే ఇంద్రియముల అధిష్ఠాతయైన అనిరుద్ధుడు అనుపేర ఖ్యాతికెక్కెను. యోగులు మనస్సును వశపరచుకొనుటకు శరత్కాలపు నల్లగలువ వలె శ్యామ వర్ణముతో నున్న అనిరుద్ధుని ఆరాధింతురు.*
*రాజస అహంకారము యొక్క అధిష్టాత అనిరుద్ధుడు. సాత్వికాహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు హృషీకములకు అధిష్టానము. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు. ఈ అనిరుద్ధుడు సకల ఇంద్రియములకూ అధిపతి. అనిరుద్ధుడూ అంటే ఆపశక్యం కాని వాడు. అందుకే మన ఇంద్రియములలో కలిగే ప్రవృత్తిని మనం ఆపలేము. అనిరుద్ధుడు ఇంద్రియాధిష్టాన దేవత. అనిరుద్ధుడు శరదృతువులో ఉండే నల్లని కలువలా ఉంటాడు. శరదృతువులో నలుపు కొంత తెలుపుతో కలిసి ఉంటుంది. అటువంటి రంగులో ఉంటాడు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నులలో సులభముగా మనకు పొందదగిన వాడు అనిరుద్ధుడు. యధాక్రమముగా మెల్లగా యోగాన్ని అవలంబిస్తూ వెళితే ఈయన దొరుకుతాడు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 72 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 28 🌴*
*28. yad vidur hy aniruddhākhyaṁ hṛṣīkāṇām adhīśvaram*
*śāradendīvara-śyāmaṁ saṁrādhyaṁ yogibhiḥ śanaiḥ*
*The mind of the living entity is known by the name of Lord Aniruddha, the supreme ruler of the senses. He possesses a bluish-black form resembling a lotus flower growing in the autumn. He is found slowly by the yogīs.*
*The system of yoga entails controlling the mind, and the Lord of the mind is Aniruddha. It is stated that Aniruddha is four-handed, with Sudarśana cakra, conchshell, club and lotus flower. There are twenty-four forms of Viṣṇu, each differently named. Among these twenty-four forms, Saṅkarṣaṇa, Aniruddha, Pradyumna and Vāsudeva are depicted very nicely in the Caitanya-caritāmṛta, where it is stated that Aniruddha is worshiped by the yogīs. Meditation upon voidness is a modern invention of the fertile brain of some speculator. Actually the process of yoga meditation, as prescribed in this verse, should be fixed upon the form of Aniruddha. By meditating on Aniruddha one can become free from the agitation of acceptance and rejection. When one's mind is fixed upon Aniruddha, one gradually becomes God-realized; he approaches the pure status of divine consciousness, which is the ultimate goal of yoga.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 111 / Agni Maha Purana - 111 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*
*🌻. హోమ విధి - అగ్ని కార్య కథనము - 5🌻*
కుండము మధ్య, బుతుస్నాత యగు లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రములకును, విద్యలకును ఉత్పత్తిస్థానము.
వరమాత్మస్వరూప డగు అగ్నిదేవుడు మోక్షమునకు కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైపునను, భుజములు ఈశాన - ఆగ్నేయదిక్కులవైపునను, కాళ్ళు వాయవ్యనైరృతిదిక్కులవైపునకును ఉండును. కుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్త్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను పిదప వాయవ్యదిక్కునుండు ఆగ్నేయదిక్కువరకును 'ఆధారములు' అనెడురెండు ఆహుతుల నివ్వవలెను.
ఇదే విధమున ఆగ్నేయమునుండి ఈశాన్యము వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండు ఉత్తర-దక్షిణ-మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, అచటనే త్యాగము చేయవలెను. పిమ్మట ''భూః స్వాహా'' ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కాసంపన్నుడగు అగ్నిదేవుని ధ్యానింపవలెను. ''
ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి''. ఈ విధముగ ధ్యానించి అగ్నిదేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యోనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. అంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.
ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 111 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 34*
*🌻 Mode of performing oblation - 5 🌻*
34. The oblation is made after having meditated on the lustrous (goddess) Lakṣmī at the middle of the pit. (She) is known as Kuṇḍalakṣmī (Lakṣmī of the sacrificial pit), the source of the material world composed of the three qualities.
35. She is the source of all beings as well as mystic learning and collection of mystic syllables. The fire is the cause of liberation. The supreme soul (Viṣṇu) is the conferer of emancipation.
36. (His) head is spoken as at the east, the two arms are situated at the corners north-east and south-east, the two thighs at the north-western and south-western corners.
37-38. The belly is called (the sacrificial) pit. The organ of generation is said to be the source. The three qualities are the girdle. Having meditated thus fifteen twigs should be placed in the fire (after reciting) Oṃ by showing muṣṭi-mudrā[9]. Oblations should be made again to the vessels and worship is offered (to the vessels) on the north-west to south-east.
39. Parts of oblations are offered (for the directions) upto the north-east with the basic mystic syllable. (Oblations are made) in the north with (the syllables) (forming) the end (of the) twelve syllables[10] and with the middle (of the mystic syllable) in the south.
40. The consecrated fire of Viṣṇu, possessing seven tongues and having the radiance of crores of sums and having the moon as its face and sun as the eye and situated in the middle of the lotus should be meditated upon with the vyāhṛtis. [11] Then one should offer one hundred and eight oblations (to this form). Then fiftyeight oblations (should be offered) and a tenth of it for the limbs.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 246 / Osho Daily Meditations - 246 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 246. నీడలు 🍀*
*🕉. మీరు మీ గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇది మంచి సంకేతం, మంచి సూచన - మీరు ఏమి చేసారు, ఎందుకు చేసారు అని చూడడం మంచిది. 🕉*
*ఒకరు అన్వేషకుడిగా తమ పనులు, కట్టుబాట్లు, దిశలు మరియు లక్ష్యాలను విచారించడం ప్రారంభించినప్పుడు, గొప్ప గందరగోళం తలెత్తుతుంది. ఆ గందరగోళాన్ని నివారించడానికి, చాలా మంది ప్రజలు తాము ఏమి చేస్తున్నారో ఎప్పుడూ ఆలోచించరు; వారు కేవలం చేస్తూనే ఉంటారు. ఒక విషయం నుండి మరొక దానికి వారు కేవలం మారిపోతూ ఉంటారు. కాబట్టి సమయం మిగిలి ఉండదు. అలసటతో, వారు నిద్రపోతారు.*
*ఉదయాన్నే వారు మళ్లీ నీడలను వెంబడించడం ప్రారంభిస్తారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది మరియు ఒక రోజు వారు ఎవరో, ఏమి చేస్తున్నారో మరియు ఎందుకు చేస్తున్నారో తెలియక చనిపోతారు. అన్వేషకులు అయిన వారు ప్రతి దానికీ సంకోచిస్తారు. ఇది జ్ఞానానికి నాంది. మూర్ఖులు మాత్రమే ఎప్పుడూ వెనుకాడరు. అన్వేషకుడిగా ఉండే బహుమతులలో ఇది ఒకటి. ఇంకా చాలా బహుమతులు ఉన్నాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 246 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 246. REFLECTIONS 🍀*
*🕉. It is a good sign, a good indication, when you have started reflecting about yourself--about what you have done, why you have done it. 🕉*
*When one starts inquiring into one's acts, commitments, directions, and goals, great confusion arises. To avoid that confusion, many people never think about what they are doing; they simply go on doing. From one thing to another they simply go on jumping, so there is no time left.*
*Tired, they fall asleep; early in the morning they start chasing shadows again. That process goes on and on, and one day they die without knowing who they were, what they were doing, and why. Now you will be hesitating about everything. It is the beginning of wisdom. Only stupid people never hesitate. Just see that this is one of the gifts of being a seeker. Many more gifts are on the way.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*
*🌻 405. 'శివదూతీ' - 1 🌻*
*శివుని దూతగా పంపునది శ్రీదేవి అని అర్థము. శివుడనగా శుభము. శ్రీమాత దర్శన మిచ్చుటకు ముందుగా శుభములు కలిగించును. శుభములను కూర్చి అటుపై దర్శనమిచ్చుట శ్రీమాత లక్షణము. శుభములు కలిగించుటకు ముందు కూడా శుభ శకునములను పంపును. శుభ శకునములన్నియూ రాబోవు శుభములను తెలియజేయు సంకేతములే. పురుషులకు కుడి కన్ను అదురుట, కుడి భుజము అదురుట, స్త్రీలకు ఎడమ కన్ను అదురుట, ఎడమ భుజము అదురుట శుభ సంకేతములే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih
Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻*
*🌻 405. 'Shivadhooti' - 1 🌻*
*It means that Lord Shiva is the messenger of Sridevi. Shiva means auspices. Shrimata brings auspiciousness before giving her darshan. Sri Mata's characteristic is to give auspicious things first and give darshan later. She sends auspicious omens even before giving auspiciousness. All omens are signs of good things to come. Twitching of right eye and right shoulder for men, left eye and left shoulder for women are auspicious signs.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
ความคิดเห็น