top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 04 - SEPTEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 04 - SEPTEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04, ఆదివారం, ఆగస్టు 2022 భాను వాసరే Sunday 🌹

2) 🌹 కపిల గీత - 65 / Kapila Gita - 65 🌹 సృష్టి తత్వము - 21

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 104 / Agni Maha Purana - 104 🌹

4) 🌹. శివ మహా పురాణము - 620 / Siva Maha Purana -620 🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 239 / Osho Daily Meditations - 239 🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 2 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹04, September 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*

*🍀. రాధాష్టమి, గౌరిపూజ శుభాకాంక్షలు 🍀*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాధాష్టమి, గౌరిపూజ, Radha Ashtami, Gauri Puja🌻*


*🍀. ఆదిత్య స్తోత్రం - 02 🍀*


*02. ఆదిత్యైరప్సరోభిర్మునిభి- రహివరైర్గ్రామణీయాతుధానైః*

*గన్ధర్వైర్వాలఖిల్యైః పరివృతదశ మాంశస్య కృత్స్నం రథస్య |*

*మధ్యం వ్యాప్యాధితిష్ఠన్ మణిరివ నభసో మణ్డలశ్చణ్డరశ్మేః*

*బ్రహ్మజ్యోతిర్వివర్తః శ్రుతినికరఘ నీభావరూపః సమిన్ధే*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఈశ్వరుడు సర్వమూ ముందే సంకల్పించి దర్శించాడు గదాయని, నీవు నిష్క్రియుడవై కూర్చుండి ఆయన విధి ఫలితం కోసమై నిరీక్షించ రాదు. నీ కర్మ కూడా ఆయన ఉపకరణం. ఆయనచే ముందుగనే నిర్ణీతమైన ఘటనకు నిమిత్త మాత్రుడవై, ఉపకరణానివై అహంకారము వర్జించి కర్మ చెయ్యి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల-అష్టమి 10:41:14 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: జ్యేష్ఠ 21:43:51 వరకు

తదుపరి మూల

యోగం: వషకుంభ 14:24:21 వరకు

తదుపరి ప్రీతి

కరణం: బవ 10:38:14 వరకు

వర్జ్యం: 04:17:16 - 05:48:12

మరియు 29:10:40 - 30:40:12

దుర్ముహూర్తం: 16:48:11 - 17:37:51

రాహు కాలం: 16:54:23 - 18:27:30

గుళిక కాలం: 15:21:16 - 16:54:23

యమ గండం: 12:15:02 - 13:48:09

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39

అమృత కాలం: 13:22:52 - 14:53:48

సూర్యోదయం: 06:02:33

సూర్యాస్తమయం: 18:27:30

చంద్రోదయం: 13:09:35

చంద్రాస్తమయం: 00:24:48

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

కాల యోగం - అవమానం 21:43:51

వరకు తదుపరి సిద్ది యోగం -

కార్య సిధ్ధి , ధన ప్రాప్తి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 65 / Kapila Gita - 65🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 21 🌴*


*21. యత్తత్సత్త్వగుణం స్వచ్ఛం శాన్తం భగవతః పదమ్*

*యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకమ్*


*పరమాత్మ ప్రకృతిని క్షోభ కలిగించడం వలన పుట్టినది మహత్ తత్వం. సత్త్వగుణమయము, స్వచ్ఛము, శాంతము ఐనది. ఈ మహత్తత్త్వము భగవంతుని ఉపలబ్ధికి స్థానమైన చిత్తము. అధిభూతమైన ఈ మహత్తత్ప్వమే ఆధ్యాత్మికంగా చిత్తమనబడును. దీనికి అధిష్ఠాత క్షేత్రజ్ఞుడు, ఉపాస్య దేవత వాసుదేవుడు. అదే విధముగా అహంకారమునకు అధిష్ఠాత రుద్రుడు, ఉపాస్యదేవత సంకర్షణుడు. బుద్ధికి అధిష్ఠాత బ్రహ్మ, ఉపాస్యదేవత ప్రద్యుమ్నుడు. మనస్సునకు అధిష్ఠాత చంద్రుడు, ఉపాస్యదేవత అనిరుద్ధుడు.*


*తప్పుడు అహంకారం నుండి విముక్తి పొందాలంటే, సంకర్షణుడిని ఆరాధించాలి. సంకర్షణుడు శివునిచే కూడా పూజించబడతాడు; శివుని దేహాన్ని కప్పి ఉంచే పాములు సంకర్షణుని ప్రతిరూపాలు. శివుడు ఎల్లప్పుడూ సంకర్షణునిపై ధ్యానంలో ఉంటాడు. నిజానికి సంకర్షణుడి భక్తుడిగా శివుని ఆరాధించే వ్యక్తి తప్పుడు, భౌతిక అహం నుండి విముక్తి పొందగలడు. మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందాలంటే అనిరుద్ధుడిని పూజించాలి. ఈ ప్రయోజనం కోసం, వేద సాహిత్యంలో చంద్ర గ్రహాన్ని ఆరాధించడం కూడా సూచించబడింది. అదే విధంగా, తమ మేధస్సులో స్థిరంగా ఉండాలంటే బ్రహ్మ ఆరాధన ద్వారా ఉన్నత స్థితిని చేరిన ప్రద్యుమ్నుని ఆరాధించాలి.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 65 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 21 🌴*


*21. yat tat sattva-guṇaṁ svacchaṁ śāntaṁ bhagavataḥ padam*

*yad āhur vāsudevākhyaṁ cittaṁ tan mahad-ātmakam*


*The mode of goodness, which is the clear, sober status of understanding the Godhead and which is generally called vāsudeva, or consciousness, becomes manifest in the mahat-tattva. The vāsudeva manifestation is called pure goodness, or śuddha-sattva. Lord's expansion mentioned as the four Personalities of Godhead—Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha. Here in the reappearance of the mahat-tattva the four expansions of Godhead occur.*


*In order to get release from the false ego, one has to worship Saṅkarṣaṇa. Saṅkarṣaṇa is also worshiped through Lord Śiva; the snakes which cover the body of Lord Śiva are representations of Saṅkarṣaṇa, and Lord Śiva is always absorbed in meditation upon Saṅkarṣaṇa. One who is actually a worshiper of Lord Śiva as a devotee of Saṅkarṣaṇa can be released from false, material ego. If one wants to get free from mental disturbances, one has to worship Aniruddha. For this purpose, worship of the moon planet is also recommended in the Vedic literature. Similarly, to be fixed in one's intelligence one has to worship Pradyumna, who is reached through the worship of Brahmā.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 104 / Agni Maha Purana - 104 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*


*🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము - 5🌻*


పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునంచి శిఖవరకును దేహము 'యం' అను వాయుబీజముచే ఎండుపోయినట్లు భావన చయవలెను.


పిమ్మట 'రం' అను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి సమస్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్ధ మై భస్మ మైనట్లు భావన చేయవలెను. పిమ్మట 'వం' బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునుండి అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధారచే శరీరము నంతను ముంచెత్తివేయవలెను.


పిమ్మట 'లం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భివించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయవలెను. పిమ్మట మానసయాగానుష్ఠానము చేయవలెను. హృదయకమలముపై అంగదేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసికవుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను.


ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. ''దేవా! దేవాధిదేవా! కేశవా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్పించు మానసికపూజను కైకొనుము.'' పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తియైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను.


ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ-అజ్ఞాన-అవైరాగ్య-అనైశ్వర్యములను పూజింపవలెను. పీఠమధ్యమునందు సత్త్వాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను, కాలతత్త్వమును, సూర్యాదిమండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపంక్తిని పూజింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 104 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 33*

*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 5 🌻*


30-31. After having meditated upon the drop which has come out of the cavity of brain with the syllable raṃ and on the body covered by a garland of flames with the syllables yaṃ and vaṃ, one has to besmear the body with the ambrosia of ashes. Then with the syllable laṃ, it should be converted into a sacred body.


32. Having made the nyāsa[4] on the hand and body one has to do mental worship. Viṣṇu is adored with his retinue in the heart-lotus with mental flowers.


33. The lord of lords who yields enjoyment and liberation has to be worshipped with the principal mystic syllable. “O lord of gods, welcome to you. O Keśava! be present here.”


34. “Accept my excellent mental adoration properly.” Then the Tortoise, the supporting power, then Ananta and then the earth have to be worshipped.


35-36. The righteousness, un-righteousness etc. (have to be worshipped) in the middle of fire etc., the lotus in the middle of sattva (goodness) etc., the principle of time, the solar and other regions and the king of birds, in māyā (illusion) and avidyā (ignorance). Then (the deities) of the quarters commencing with north-west and ending with north-east as well as the line of preceptors.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 619 / Sri Siva Maha Purana - 619 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴*

*🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 2 🌻*


మిక్కిలి భయంకరాకారుడు, కంగారు లేనివాడు, ఆరు మోములవాడు, ఇంతటివాడు అని చెప్ప వీలుకానివాడు అగు ఆతడు వచ్చుచుండగా చూచి ఆ రాక్షసుడు దేవతలతో నిట్లనెను : ఈతడు శత్రుసంహారకుడగు కుమారుడు (13). ఏకైక వీరుడనగు నేను ఈతనితో యుద్ధమును చేసెదను. వీరులనందరినీ, మరియు సర్వగణములను, లోకపాలకులను, హరి మొదలగు నాయకులను సంహరించెదను (14). మహాబలుడగు ఆతడు అపుడు ఇట్లు పలికి యుద్ధము చేయుట కొరకు కుమారుని వైపునకు వెళ్లెను. ఆ తారకుడు మహాద్భుతమగు శక్తిని చేతబట్టి నిట్లనెను (15).


తారకుడిట్లు పలికెను -

మీరు నా యెదుటకు ఇప్పుడు కుమారుని ఎట్లు పంపగల్గితిరి? ఓ దేవతలారా! మీరు సిగ్గు లేనివారు. ఇంద్రవిష్ణువులు అసలేసిగ్గులేనివారు (16). వీరిద్దరు పర్వము వేదమార్గ విరుద్ద మగు కర్మను చేసినారు. నేను దానిని విశేషముగా వర్ణించెదను. వినుడు (17). వారిద్దరిలో విష్ణువు విశేషించి మోసగాడు, దోషి, వివేకము లేనివాడు. అతడు పూర్వము పాపమార్గములో మోసము చేసి బలిని బంధించినాడు (18). వేదమార్గ విహీనుడగు నాతడు పూర్వము మధుకైటభులను రాక్షసులను మోసముచే శిరస్సుల నపహరించి సంహరిచినాడు (19).


దేవదానవులు అమృతపానము చేసే సందర్భములో ఈతడు మోహినీరూపమును దాల్చి పంక్తి భేదమును చేసి వేదమార్గమును కళంకితము చేసినాడు (20). ఇతడు రాముడై స్త్రీని చంపి, వాలిని వధించి, మరియు బ్రాహ్మణుడగు రావణుని చంపి వైదిక నీతిని చెడగొట్టినాడు (21). ఈతడు స్వార్ధము కొరకు పాపియై ఏ పాపము నెరుంగని ఇల్లాలిని విడనాడి వేదమార్గమును ధ్వంసము చేసినాడు(22). ఇతడు పరశు రామావతారములో తన తల్లి యొక్క తలను నరకినాడు. ఈ దుష్టుడు గురుపుత్రుని అవమానించినాడు (23).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 619🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴*


*🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 2 🌻*


13. On seeing the incomprehensible six-headed deity coming forward, fierce and unagitated, the Asura spoke to the gods derisively—“O this child indeed will slay the enemies!”


14. I will fight with him single-handed. I will kill the soldiers, the Gaṇas and the guardians of the quarters led by Viṣṇu.


15. Saying thus, the powerful Asura rushed at Kumāra to fight with him. Tāraka seized his wonderful spear and spoke to the gods.


Tāraka said:—

16. “How is it that you all kept Kumāra face to face with me? You gods are shameless especially Indra and Viṣṇu.


17. Formerly, both of them had acted in violation of the Vedic path. Listen. I shall describe the same.


18. Viṣṇu is deceptive, defective and indiscreet. It was by him that Bali[1] was formerly bound by taking recourse to deception with sinful intention.


19. The Asuras Madhu and Kaiṭabha[2] were beheaded by his roguishness. He forsook the Vedic path.


20. When the gods and Asuras sat for drinking the nectar it was he who violated the sanctity of the vows when he assumed the form of an enchantress.[3] Thus he slighted the Vedic path.


21. Taking birth as Rama he killed a woman (Tāḍakā). Bālī’s death was brought about by him with a vile trick. A brahmin descendant of Viśravas was killed by him.[4] Thus he violated the injunction of the Śruti.


22. Sinful that he was, he forsook his own innocent wife. There too, he violated the path of Śruti for achieving his selfish end.


23. In his sixth incarnation (as Paraśurāma) [5] he cut off the head of his own mother. This wicked man insulted his own preceptor’s son.[6]


Continues....

🌹🌹🌹🌹🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹






*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 239 / Osho Daily Meditations - 239 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 239. పని వ్యసనం 🍀*


*🕉. పని మంచిదే కానీ అది వ్యసనంగా మారకూడదు. ఒక తాగుబోతు తనని తాను మరచి పోయినట్లుగా చాలా మంది తమ పనిని మత్తు మందుగా మార్చుకున్నారు. 🕉*

*ఒకరు చేయని విధంగా పని చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి - అప్పుడు ఒకరు స్వేచ్ఛగా ఉంటారు. ఒకరు కష్టపడి పని చేస్తున్నప్పుడు మరియు చాలా పనులు చేస్తున్నప్పుడు ఎంత పరిపూర్ణంగా మరియు అందంగా మరియు ఆనందంగా ఉండే సామర్థ్యం కలిగి ఉండాలి; అప్పుడు వారు సరళమైన వారు. రెండు రకాల వ్యక్తులు ఉన్నారు: కొంతమంది తమ బద్ధకానికి అతుక్కుపోతారు మరియు మరొక విధంగా, వారి వృత్తిలో అతుక్కుపోయిన వారు. ఇద్దరూ జైళ్లలో ఉన్నారు.*


*ఎలాంటి శ్రమ లేకుండా, అప్రయత్నంగా ఒకరి నుంచి మరొకరికి వెళ్లగలిగే సామర్థ్యం ఉండాలి. అప్పుడు మీకు ఒక నిర్దిష్ట స్వేచ్ఛ, ఒక నిర్దిష్ట దయ మరియు మీ ఉనికికి స్వేచ్చ ఉంటుంది. నేను పనికి వ్యతిరేకం కాదు, దేనికీ వ్యతిరేకం కాదు - కానీ ఏదీ వ్యసనంగా మారకూడదు. లేకపోతే, మీరు చాలా గందరగోళ స్థితిలో ఉన్నారు. పని అనేది ఒక వృత్తి మరియు మీరు దానిలో మిమ్మల్ని మీరు దాచుకుంటే, అది పునరావృతమయ్యే విషయం, యాంత్రిక విషయం అవుతుంది. పని ఒక వ్యసనం లాగా మారుతుంది; అప్పుడు నీకు పని పని దయ్యం పట్టినట్టే.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 239 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 239. WORKAHOLISM 🍀*


*🕉. Work is good, but it should not become an addiction. Many people have turned their work into a drug so that they can forget themselves in it just like a drunkard forgetting himself in alcohol. 🕉*

*One should be as capable of nondoing as of doing-then one is free. One should be capable of sitting, not doing anything, as perfectly and beautifully and blissfully as when one is working hard and doing many things; then one is flexible. There are two types of people: a few who are glued into their lethargy and at the other extreme, those who are glued into their occupation. Both are in prisons.*


*One should be capable of moving from one to another with no effort, effortlessly. Then you have a certain freedom, a certain grace and a spontaneity to your being. I am not against work, I am not against anything-but nothing should become an addiction. Otherwise, you are in a very very confused state. If work is an occupation and you are just hiding yourself in it, then it becomes a repetitive thing, a mechanical thing. Work becomes more like an obsession; you are possessed by a demon.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*

*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*


*🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 2 🌻*


*శివునికి లోహితాక్షుడు అను నామము కలదు. అతను తపః స్వరూపుడు. అగ్ని స్వరూపుడు. అందువలన అతని కన్నులు ఎఱ్ఱ జీరతో నుండును. ఎఱ్ఱని కమలములు ఆయన కన్నులతో పోల్చ బడినవి. ఎఱ్ఱని ఆయన నయన కమలములకు తెల్లని చల్లని వెన్నెలను అందించునది శ్రీమాత. దానివలన శ్రీ శివునకు ఆహ్లాదము కలుగును. శివుడు తపస్వి అగుటచే అతనికి చల్లదనమును సమకూర్చుట తన ధర్మమని శ్రీమాత భావించునని కవి భావము.*


*స్త్రీ ఆహ్లాదమును కూర్చున దైనపుడు మాత్రమే పురుషుడు పరిపూర్ణ ఆనందమును పొందగలడు. చిట్టుబుట్టులాడు స్త్రీలు గృహశాంతిని, సంపదను హరించు చుందురు. స్త్రీలోకమునకు శ్రీమాత ఈ సందేశము ద్వారా పతివ్రతా ధర్మము నొకటి ఆవిష్కరించు చున్నది. ఈ కారణము గనే సీత, సావిత్రి, అనసూయ ఈ ధర్మమును పాటించిరి గనుక పతివ్రతలైరి. కార్తీక మాసము శివ తత్త్వమునకు ప్రతీక. అందలి వెన్నెల శ్రీమాతకు ప్రతీక.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*


*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*

*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*


*🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 2 🌻*


*Lord Shiva has the name Lohitaksha, the fiery eyed. He is the embodiment of penance. Embodiment of fire. So his eyes are red tinge in them. Red lotuses are compared to His eyes. Srimata is the one who gives the white and cold moonlight to the red lotus like eyes of the Lord. That will please Lord Shiva. The poet feels that Srimata thinks it is her dharma to provide coolness to Lord Shiva, the embodiment of the fires of penance.*


*It is only when the woman brings bliss can a man attain complete happiness. Disturbed women destroy domestic peace and wealth. Through this message, Sri Mata is innovating a virtue of Pativrata to the world of women. This is the reason why Sita, Savitri and Anasuya followed this dharma and became celibates. The month of Kartika is symbolic of Shiva Tattva. It's moonlight symbolizes Srimata.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹




🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page