top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 05 - DECEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 05 - DECEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹

1) 🌹05 - DECEMBER డిసెంబరు - 2022 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 292 / Bhagavad-Gita -292 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -12వ శ్లోకము.

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 653 / Sri Siva Maha Purana - 653 🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 004 / DAILY WISDOM - 004 🌹 సంపూర్ణ నిశ్శబ్దం The Supreme Silence

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 269 🌹

6) 🌹. శివ సూత్రములు - 06/ Siva Sutras - 06 🌹. 3. యోనివర్గః కాలశరీరం - 1 Yonivargaḥ kalāśarīram - 1


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹05, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, హనుమాన్‌ జయంతి (కన్నడ), Pradosh Vrat, Hanuman Jayanti (Kannada) 🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 10 🍀*


*17. త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |*

*అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుః సువర్చసః*

*18. గజహా దైత్యహా కాలో లోకధాతా గుణాకరః |*

*సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : నీ సొంతవిషయాల్లో, వివాదాలకు దిగకుండా వుండడానికే నీవెప్పుడూ ప్రయత్నించాలి. కాని, ప్రజా వ్యవహారాల్లో మాత్రం సమరానికి నీవు వెనుదీయరాదు. అయితే, ఆ సమరం కొనసాగించే టప్పుడు కూడా, నీ ప్రతికక్షి శక్తిసామర్థ్యాలను గుర్తించి మెచ్చుకో. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల త్రయోదశి 30:48:49

వరకు తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: అశ్విని 07:15:07 వరకు

తదుపరి భరణి

యోగం: పరిఘ 27:06:05 వరకు

తదుపరి శివ

కరణం: కౌలవ 18:22:53 వరకు

వర్జ్యం: 03:05:20 - 04:45:12

మరియు 17:24:36 - 19:06:12

దుర్ముహూర్తం: 12:28:46 - 13:13:21

మరియు 14:42:30 - 15:27:05

రాహు కాలం: 07:55:44 - 09:19:18

గుళిక కాలం: 13:30:04 - 14:53:39

యమ గండం: 10:42:53 - 12:06:29

అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28

అమృత కాలం: 27:34:12 - 29:15:48

సూర్యోదయం: 06:32:09

సూర్యాస్తమయం: 17:40:49

చంద్రోదయం: 15:38:12

చంద్రాస్తమయం: 03:51:36

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు : రాక్షస యోగం - మిత్ర కలహం

07:15:07 వరకు తదుపరి చరయోగం -

దుర్వార్త శ్రవణం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 292 / Bhagavad-Gita - 292 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 12 🌴*


*12. యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |*

*మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ||*


🌷. తాత్పర్యం :

*సత్త్వగుణమునకు గాని, రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నియును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలిసికొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై యున్నాను. ప్రకృతిత్రిగుణములు నా యందున్నను నేను వాటికి లోబడియుండును.*


🌷. భాష్యము :

జగమునందలి సమస్తకర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహింపబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాడు. ఉదాహరణకు రాజ్యాంగనియమములచే ఎవ్వరైనను శిక్షింపబడవచ్చునేమో కాని, ఆ రాజ్యాంగమును తయారుచేసిన రాజు మాత్రం రాజ్యాంగనియమములకు అతీతుడై యుండును. అదే విధముగా సత్త్వరజస్తమోగుణములు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉద్భవించినను అతడెన్నడును ప్రకృతిచే ప్రభావితుడు కాడు. కనుకనే అతడు నిర్గుణుడు. అనగా గుణములు అతని నుండియే కలుగుచున్నను అతనిపై ప్రభావము చూపలేవు. అదియే భగవానుని లేదా దేవదేవుని ప్రత్యేక లక్షణములలో ఒకటి.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 292 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 7 - Jnana Yoga - 12 🌴*


*12. ye caiva sāttvikā bhāvā rājasās tāmasāś ca ye*

*matta eveti tān viddhi na tv ahaṁ teṣu te mayi*


🌷 Translation :

*Know that all states of being – be they of goodness, passion or ignorance – are manifested by My energy. I am, in one sense, everything, but I am independent. I am not under the modes of material nature, for they, on the contrary, are within Me.*


🌹 Purport :

All material activities in the world are being conducted under the three modes of material nature. Although these material modes of nature are emanations from the Supreme Lord, Kṛṣṇa, He is not subject to them. For instance, under the state laws one may be punished, but the king, the lawmaker, is not subject to that law. Similarly, all the modes of material nature – goodness, passion and ignorance – are emanations from the Supreme Lord, Kṛṣṇa, but Kṛṣṇa is not subject to material nature. Therefore He is nirguṇa, which means that these guṇas, or modes, although issuing from Him, do not affect Him. That is one of the special characteristics of Bhagavān, or the Supreme Personality of Godhead.

🌷🌷🌷🌷🌷


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 653 / Sri Siva Maha Purana - 653 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴*

*🌻. గణేశ శిరశ్ఛేదము - 1 🌻*


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ నారదా! భక్తులననుగ్రహించు మహేశ్వరుడు ఈ నీ మాటను విని నీ మాటచే ఆ బాలునితో యుద్ధమును చేయుటకు నిశ్చయించెను (1). ముక్కంటి దేవుడు విష్ణవును పిలిచి ఆయనతో సంప్రదించి పెద్ద సైన్యముతో దేవతలతో గూడి గణేశుని ఎదుట నిలబడెను (2). మహాబలము గలవారు, గొప్ప ఉత్సహము గలవారు, శివుని మంచి చూపు ప్రసరించిన వారు అగు దేవతలు శివుని పాదపద్మములను స్మరించి వానితో యుద్ధమును చేసిరి (3). మహాబలపరాక్రమ శాలి, గొప్ప దివ్యమగు ఆయుధములు గలవాడు, వీరుడు, సమర్థుడు, శివస్వరూపుడు అగు విష్ణువు అపుడు అతనితో యుద్ధమును చేసెను (4).


శక్తిచే ఈయబడిన మహాబలము గల ఆ గణాధిపుడు అపుడు కర్రతో దేవ శ్రేష్ఠులను మరియు విష్ణువును వెంటనే కొట్టెను (5). ఓ మునీ! విష్ణువుతో సహా దేవతలందరు ఆ వీరునిచే కర్రతో కొట్ట బడిన వారై మొక్క వోయిన బలము గల వారై వెనుకకు దిరిగిరి (6). ఓ మునీ! శివుడు కూడా సైన్యముతో గూడి చిరకాలము యుద్ధము చేసి, భయమును గొల్పుచున్న ఆ గణేశుని గాంచి మిక్కలి ఆశ్చర్యమును పొందెను (7).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 653🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴*


*🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 1 🌻*


Brahmā said:—


1. O Nārada, on hearing your words, the great lord who grants benediction to his devotees became desirous of fighting with the boy.


2. He called Viṣṇu and consulted him. Then with a great army and the gods, He, the three-eyed lord, stood face to face with him.


3. After remembering the lotuslike feet of Śiva, the gods possessing great strength, kindly glanced at by Śiva and highly jubilant, fought with him.


4. Viṣṇu of great strength, valour and skill and possessing great divine weapons and Śivā’s form fought with him.


5. Gaṇeśa hit all the chief gods with his staff. He hit Viṣṇu too, all of a sudden. The hero had been conferred great strength by the Śaktis.


6. O sage, all the gods including Viṣṇu were hit by him with the stick. They were turned back with their strength sapped.


7. O sage, after fighting for a long time along with the army and seeing him terrific, even Śiva was greatly surprised.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 04 / DAILY WISDOM - 04 🌹*

*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 04. అపరిచతంలోకి వ్యక్తి వీరోచిత దూకుడు 🌻*


*అపరిచితం లోకి వీరోచితంగా దూకడం అనేది ఉన్నతమైన ఆనందము అందుకోవడానికి గల సంసిద్ధతను తెలియజేస్తుంది. జీవితంలో పరిమితికి సంబంధించిన అసంతృప్తి వల్ల ఆత్మ తన వ్యక్తిత్వ పరిధి అందుకోలేని పరిపూర్ణతను పట్టుకోవడానికి పూనుకుంటుంది. అందువల్ల, విశ్వచలనము మరియు వ్యక్తిగత ప్రయత్నం, ప్రకృతి పట్ల వారి వైఖరి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తున్నా, జీవుడు తన పరిపూర్ణత అందుకునే ప్రక్రియలోని భిన్న పార్శ్వాలు.*


*సర్వత్రా సత్యమే అయి ఉన్న చైతన్యం యొక్క ఒత్తిడి వ్యక్తులను వారి పరిమితులను అధిగమించడానికి, ఆ అపరిమితంలో వారి శాశ్వతమైన విశ్రాంతిని కనుగొనడానికి ప్రేరేపించే శక్తికి మూలం. ఈ శాశ్వత సత్యం అనేది సృష్టిలో విశ్వప్రయత్నం ద్వారా అన్వేషించబడే అత్యున్నత వస్తువు, ఇందులో మాత్రమే శక్తుల బాహ్యీకరణకు సంబంధించిన అన్ని ప్రేరణలు అంతం చేయబడతాయి. సర్వం తానకే కావాలనే కోరిక అనంతం యొక్క అనుభవంలో ముగుస్తుంది.*


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 DAILY WISDOM - 04 🌹*

*🍀 📖 From The Realisation of the Absolute 🍀*

📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj


*🌻 04. The Heroic Leap of the Individual Into the Unknown 🌻*


*The heroic leap of the individual into the unknown is the expression of the want of a superior joy. The dissatisfaction with limitedness in life directs the soul to catch the fullness of perfection in the truth of its Integrality, with which the individualised condition is not endowed. Hence, universal movement and individual effort, though differing in their altruism of nature, can be understood as a reflection of the tendency to Self-Perfection of Being.*


*The pressure of the truth of the absoluteness of consciousness is the source of the force that compels individuals to transcend their finitude and find their eternal repose in it alone. This permanent Verity is the supreme object of quest through the cosmical endeavour in creation, wherein alone all further impulses for externalisation of forces are put an end to. The desire to become the All terminates in the experience of Infinitude.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 269 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. నీ అస్తిత్వం, అనంత అస్తిత్వం కలిసే దగ్గర కాంతి వస్తుంది. శాశ్వత జీవనం ఆరంభం మొదలవుతుంది. 🍀*


*నమ్మకాన్ని ప్రేమని, ఆనందాన్ని సృష్టించడానికి స్వేచ్ఛను వుపయోగిస్తే దేవుడు వాటి గుండా ప్రవేశిస్తాడు. నీ అస్తిత్వం, అనంత అస్తిత్వం కలిసే దగ్గర కాంతి వస్తుంది. శాశ్వత జీవనం ఆరంభం మొదలవుతుంది.*


*జ్ఞాతంగా, అజ్ఞాతంగా ప్రతి మనిషి ప్రయత్నం దాని కోసమే. అవ్యక్తమయిన దాని అన్వేషణే ప్రతి మనిషిలో వుంది. ప్రతి ఒక్కరూ కాంతిలోకి రావాలను కుంటారు. దాన్ని చూడ్డానికి కళ్ళు కావాలను కుంటారు. కానీ తమ చూపుకు అడ్డు వచ్చే పనులు చేస్తారు. అంతదృష్టిని అడ్డుకుంటారు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శివ సూత్రములు - 06 / Siva Sutras - 06 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

1- శాంభవోపాయ

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻3. యోనివర్గః కాలశరీరం - 1 🌻*

*🌴. ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం.🌴*


*యోని అనేది దైవిక సంతానోత్పత్తి శక్తికి విలక్షణమైన చిహ్నం (లలితా సహస్రనామం నామం 895 'యోని నిలయా'). బ్రహ్మ సూత్రం (I.iv.27) కూడా 'యోని కా హి గీయతే' అని చెబుతుంది. కావున దివ్య సంతాన శక్తికి మూలం బ్రహ్మం. ముండక ఉపనిషత్తు (III.i.3) 'బ్రహ్మ యోనిమ్' అని చెప్పడం ద్వారా పై ప్రకటనలను ధృవీకరిస్తుంది. సూత్రం 2లో చర్చించినట్లుగా ఈ సృష్టించే శక్తి మాయ. వర్గ అంటే మనస్సు యొక్క ఐదు ప్రాథమిక అంశాల యొక్క విభిన్న తత్త్వాలు.*


*ఈ తత్వాల ఫలితమే మాయ. మాయే ఈ భౌతిక విషయప్రపంచానికి మూలం . మొదటి సూత్రం చైతన్యం యొక్క స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది మరియు రెండవ సూత్రం జ్ఞానం యొక్క స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ సూత్రం అజ్ఞానానికి మూలం గురించి చర్చిస్తుంది. కాలా అంటే ప్రక్రియ మరియు శరీరం అంటే దేహం. కాబట్టి, కాలశరీరం అంటే భౌతిక జీవితాన్ని నిర్వహించే ప్రక్రియ. భౌతిక జీవితమే బంధం మరియు ఈ బంధానికి మూలం మాయ లేదా భ్రాంతి.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Siva Sutras - 06 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻3. Yonivargaḥ kalāśarīram - 1 🌻*

*🌴 The multitude of similar origins is the body of parts of the whole.🌴*


*Yoni is the typical symbol of divine procreative energy (Lalithā Sahasranāmam nāmā 895 ‘yoni nilayā’). Brahma sūtrā (I.iv.27) also says “yoni ca hi gīyathe”. Therefore, the source of the divine procreative energy is the Brahman. Mundaka Upanishad (III.i.3) confirms the above statements by saying “brahma yonim”. This procreative energy is māyā as discussed in sūtrā 2. Vargaḥ means the tattvās, known as the principles of creation, comprising of different modifications of five basic elements and products of mind.*


*Māyā is the outcome of tattvās which is the source for the materialistic world. First sūtrā stressed the importance of purity of consciousness and the second sūtrā emphasised the importance of purity of knowledge. This sūtrā discusses about the source of ignorance. Kalā means process and śarīram means body. Therefore, kalāśarīram means the process through which materialistic life is carried out. Materialistic life itself is bondage and the source for this bondage is māyā or illusion.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



Join and Share

コメント


Post: Blog2 Post
bottom of page