🌹🍀 05 - SEPTEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 05, సెప్టెంబర్ 2022 సోమవారం, ఇందువాసరే Monday 🌹
*🍀. దశావతార దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి.🍀*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 258 / Bhagavad-Gita -258 - 6-25 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 657 / Vishnu Sahasranama Contemplation - 657 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 336 / DAILY WISDOM - 336 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 236 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹05, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి విసర్జనం, Gauri Visarjan 🌻*
*🍀. రుద్రనమక స్తోత్రం - 40 🍀*
*వ్యాస ఉవాచ:*
*ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!*
*కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!*
*త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!*
*స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అజ్ఞానంలో ఉన్నప్పుడు పాపజీవులను ఏవగించు కుంటాము. అజ్ఞానం తొలగిన మీదట వారిలోని ఆత్మకు నమస్కరిస్తాము. కానీ ఈ జీవులు విపరీతమైన పాపభారాన్ని మోస్తూ, సంసార సాగర మథనంలో పుట్టిన కాలకూట విషంలో విశేష భాగాన్ని మనందరి కోసమూ ఓడ్చి వేస్తున్నారు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వర్ష ఋతువు,
దక్షిణాయణం, భాద్రపద మాసం
తిథి: శుక్ల-నవమి 08:29:03 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: మూల 20:06:49 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: ప్రీతి 11:28:33 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ 08:27:03 వరకు
వర్జ్యం: 05:11:20 - 06:40:48
మరియు 28:55:36 - 30:23:52
దుర్ముహూర్తం: 12:39:31 - 13:29:07
మరియు 15:08:19 - 15:57:55
రాహు కాలం: 07:35:42 - 09:08:43
గుళిక కాలం: 13:47:43 - 15:20:43
యమ గండం: 10:41:43 - 12:14:43
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 14:08:08 - 15:37:36
సూర్యోదయం: 06:02:42
సూర్యాస్తమయం: 18:26:43
చంద్రోదయం: 14:13:54
చంద్రాస్తమయం: 00:24:48
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
లంబ యోగం - చికాకులు, అపశకునం
20:06:49 వరకు తదుపరి ఉత్పాద
యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దశావతార దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి. 🌹*
*🙏. ప్రసాద్ భరధ్వాజ*
☘️. *భాద్రపద శుద్ధ దశమి దశావతార దశమి* ☘️
*లోకంలో సాధు సజ్జనుల జీవితానికి దుష్టుల వలన అంతరాయం కలుగుతున్నప్పుడు బలవంతుల హింసకి నిస్సహాయులు తాళలేక పోతున్నప్పుడు భక్తుల ప్రశాంతతకి భంగం వాటిల్లినప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి శ్రీమహా విష్ణువు రంగంలోకి దిగుతూ వచ్చాడు. సందర్భాన్ని బట్టి లోక కల్యాణం కోసం ఒక్కో అవతారాన్ని ధరిస్తూ వచ్చాడు. వాటిలో దశావతారాలు అతి ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి.*
*మత్స్యావతారం , కూర్మావతారం , వరాహావతారం , నరసింహావతారం , వామనావతారం , పరశురామావతారం , రామావతారం , కృష్ణావతారం , బుద్ధావతారం , కల్క్యవతారం , దశావతారాలుగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఆయా అవతారాలను ధరించిన రోజున ఆ రూపంలో స్వామిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది.*
*'భాద్రపద శుద్ధ దశమి' దశావతారాలను పూజించవలసిన రోజుగా చెప్పబడుతూ వుండటం విశేషం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల ప్రతిమలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని , వ్రత విధానం ద్వారా పూజించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస నియమం పాటించ వలసి ఉంటుంది. దశావతార వ్రత విధానంతో దశావతారాలలోనున్న స్వామిని ఈ రోజున పూజించడం వలన , సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.*
*🌹. దశావతారస్తుతి 🌹*
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||
వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే
మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౧
మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౨
భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే
క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౩
హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో
నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౪
బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే
వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౫
క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే
భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౬
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౭
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే
కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ ౮
త్రిపురసతీ మానవిహరణా త్రిపురవిజయమార్గనరూపా
శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మామ్ ౯
శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే
కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మామ్ ౧౦
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ౧౧
🌹 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 258 / Bhagavad-Gita - 258 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 25 🌴*
*25. శనై: శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా |*
*ఆత్మసంస్థం మన: కృత్వా న కించిదపి చిన్తయేత్ ||*
🌷. తాత్పర్యం :
*నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధిమగ్నుడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు.*
🌷. భాష్యము :
సరియైన నిశ్చయము మరియు బుద్ధి ద్వారా మనుజుడు ఇంద్రియకర్మల నుండి క్రమముగా విరమణను పొందవలెను. ఇదియే “ప్రత్యాహారము” అనబడును. అనగా నిశ్చయము, ధ్యానము, ఇంద్రియకర్మల నుండి విరమణ ద్వారా మనస్సును సమాధి యందు లగ్నము చేయవలెను. ఆ సమయమున భౌతికభావన యందు కూరుకొనిపోవుట యనెడి భయము ఏమాత్రము కలుగదు.
వేరుమాటలలో దేహమున్నంతవరకు మనుజుడు భౌతిక విషయములను కూడియుండ వలసి వచ్చును ఇంద్రియతృప్తి భావనను మాత్రము కలిగియుండరాదు. శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన ప్రియమును గూర్చి అతడు చింతింపరాదు. ఇట్టి దివ్యస్థితి కృష్ణపరమగు కర్మల యందు ప్రత్యక్షముగా పాల్గొనుట ద్వారా సులభముగా ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 258 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 25 🌴*
*25. śanaiḥ śanair uparamed buddhyā dhṛti-gṛhītayā*
*ātma-saṁsthaṁ manaḥ kṛtvā na kiñcid api cintayet*
🌷 Translation :
*Gradually, step by step, one should become situated in trance by means of intelligence sustained by full conviction, and thus the mind should be fixed on the Self alone and should think of nothing else.*
🌹 Purport :
By proper conviction and intelligence one should gradually cease sense activities. This is called pratyāhāra. The mind, being controlled by conviction, meditation and cessation from the senses, should be situated in trance, or samādhi. At that time there is no longer any danger of becoming engaged in the material conception of life.
In other words, although one is involved with matter as long as the material body exists, one should not think about sense gratification. One should think of no pleasure aside from the pleasure of the Supreme Self. This state is easily attained by directly practicing Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 657 / Vishnu Sahasranama Contemplation - 657🌹*
*🌻657. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ🌻*
*ఓం విష్ణవే నమః | ॐ विष्णवे नमः | OM Viṣṇave namaḥ*
*రోదసీ వ్యాప్యకాన్తిరభ్యధికాస్యస్థితేతి సః ।*
*విష్ణురిత్యుచ్యతే సద్భిః కేశవోఽయం త్రివిక్రమః ॥*
*విషౢ వ్యాప్తౌ అను ధాతువు నుండి 'వేవేష్టి' - 'వ్యాపించి యున్నది' అను అర్థమున విష్ణు శబ్దము ఏర్పడును. పృథివీలోక ద్యుల్లోకముల నడిమి ప్రదేశమును వ్యాపించి ఈతని అభ్యధిక కాంతి నిలిచి యున్నది గావున విష్ణుః అనబడును.*
:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
గతిశ్చ సర్వభూతానాం ప్రజనశ్చాపి భారత ।
వ్యాప్తా మే రోదసీ పార్థ కన్తిశ్చాభ్యధికా మమ ॥ 42 ॥
అధిభూతాని చాన్తేషు తదిచ్ఛంశ్చాస్మిభారత ।
క్రమణాచ్చాప్యహం పార్థ విష్ణురిత్యభిసం జ్ఞితః ॥ 43 ॥
*అర్జునా! అన్ని ప్రాణులయొక్క గతి, ఉత్పత్తుల స్థానము నేనైయున్నాను. పృథివీ ఆకాశములంతటను వ్యాపించియున్నాను. నా తేజము అన్నిటిని మించినది. అంతకాలమునందు జీవిలు ఏ పరబ్రహ్మమును పొందగోరుతారో అదీ నేనే. నేను సర్వమును అతిక్రమించియున్నవాడను. ఈ కారణములవల్ల నాకు విష్ణువు అన్న నామము గలదు.*
2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
258. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 657🌹*
*🌻657. Viṣṇuḥ🌻*
*OM Viṣṇave namaḥ*
रोदसी व्याप्यकान्तिरभ्यधिकास्यस्थितेति सः ।
विष्णुरित्युच्यते सद्भिः केशवोऽयं त्रिविक्रमः ॥
*Rodasī vyāpyakāntirabhyadhikāsyasthiteti saḥ,*
*Viṣṇurityucyate sadbhiḥ keśavo’yaṃ trivikramaḥ.*
*From the root विषॢ व्याप्तौ / Viṣḷu vyāptau, the word वेवेष्टि / veveṣṭi is derived which means pervading - from which the word Viṣṇu is derived. His splendor pervades the firmament and remains beyond; so Viṣṇuḥ.*
:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
गतिश्च सर्वभूतानां प्रजनश्चापि भारत ।
व्याप्ता मे रोदसी पार्थ कन्तिश्चाभ्यधिका मम ॥ ४२ ॥
अधिभूतानि चान्तेषु तदिच्छंश्चास्मिभारत ।
क्रमणाच्चाप्यहं पार्थ विष्णुरित्यभिसं ज्ञितः ॥ ४३ ॥
Śrī Mahābhārata - Book 12, Chapter 341
Gatiśca sarvabhūtānāṃ prajanaścāpi bhārata,
Vyāptā me rodasī ptha kantiścābhyadhikā mamaār. 42.
Adhibhūtāni cānteṣu tadicchaṃścāsmibhārata,
Kramaṇāccāpyahaṃ pārtha viṣṇurityabhisaṃ jñitaḥ. 43.
*I am the Source and Destiny of all beings. I pervade firmament and beyond. Mine is the superior splendor. I am the destiny aspired by all upon during their end of life. I am situated atop having transgressed everything. These are the reasons O Arjuna, I am known as Viṣṇu.*
2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
258. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ krtāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 336 / DAILY WISDOM - 336 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻 1. విషయాలతో ఎవరూ పూర్తిగా సంతృప్తి చెందలేరు 🌻*
*ప్రపంచంలో ఎవరూ విషయాలతో పూర్తిగా సంతృప్తి చెందారని చెప్పలేము. ఒకరిని ఏ స్థితిలో ఉంచినా, ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. జీవితంలో ఎక్కడా ఏదీ పూర్తి కాదు. ప్రతి దానిపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. కారణాన్ని సులభంగా అర్థం చేసుకోలేక పోయినా ఏదీ ఎవరినీ సంతృప్తి పరచదు. కష్టాలన్నీ సామాజికంగా నిర్మించబడ్డాయని ఊహించవచ్చు. మనిషి చుట్టూ చూస్తాడు మరియు ప్రజలను చూస్తాడు మరియు వారు ప్రవర్తించే విధానం పట్ల పూర్తిగా అసంతృప్తి చెందుతాడు.*
*'ఇది ఎంత నీచమైన సమాజం!' అనుకుంటాడు. అతను జీవితంలో చూసే చెడుకు సమాజం మూలం అనే భావనతో అతను తరచుగా ఫిర్యాదు చేస్తాడు. తన బాధలు ఇతర వ్యక్తుల వల్ల కలుగుతాయని అతను నమ్ముతాడు. కానీ నిజానికి మనిషి స్వభావమే అతని దుఃఖానికి మూలం. మనిషి మనిషిలా ప్రవర్తించడం లేదు. “మనిషి మనిషిని ఏం చేసాడు” అంటాడు ఒక కవి. సమాజం తనకు తానుగా నిర్దేశించు కోవలసిన విధంగా లేదు. మానవ సమాజ నిర్మాణంలో ఏదో ఘోరమైన తప్పు ఉంది. కాబట్టి, ఒకరు ఆకాశం వైపు చూస్తూ, 'నేను ఏమి చేయగలను?' అనుకుంటూ ఉంటాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 336 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 1. No One can be Fully Satisfied with Things 🌻*
*No one in the world can be said to be fully satisfied with things. In whatever condition one may be placed, there is a kind of dissatisfaction. Nothing is complete in life anywhere. There are some complaints to make against everything. Nothing can satisfy anybody, though the reason why cannot be easily understood. One is likely to imagine that all the difficulties are socially constructed. Man looks around and sees people, and is thoroughly dissatisfied with the way they are behaving.*
*“What a wretched society it is!” he often complains under the impression that society is the source of the evil that he sees in life. He believes his sorrows are caused by other people. It is the cussedness of man's nature that is the source of his sorrows. Man is not behaving as man. “What man has made of man,” says the poet. Society is not directing itself in the way it ought to. There is something dead wrong in the structure of human society. So, one looks up to the skies and exclaims, “What can I do?”*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 236 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. రాయిలా కఠినం వుండకు. మృదువుగా నీళ్ళలా వుండు'. చివర్న మృదువయింది కఠినమయిన దాని మీద విజయం సాధిస్తుంది. ఒక రోజు రాయి మాయమయి పోతుంది. సమయం పడుతుంది. అది గ్రహించడానికి అంతర్ద్రృష్టి వుండాలి. 🍀*
*శతాబ్దాలుగా పురుషాధిక్యాన్ని పైకెత్తారు. ప్రశంసించారు. దౌర్జన్యాన్ని, క్రూరత్వాన్ని, శౌర్యాన్ని పురుష లక్షణాలుగా చెప్పారు. స్త్రీ సంబంధమైన లక్షణాల్ని ఖండించారు. అందువల్ల గొప్ప సమస్య వచ్చింది. అందమైందంతా స్త్రీ లక్షణానికి చెందింది. ఐతే నువ్వు స్త్రీత్వాన్ని ఖండిస్తే ప్రపంచం నించీ సౌందర్యం అదృశ్యమయి పోతుంది. మనం సౌందర్యాన్ని సర్వ నాశనం చెయ్యడానికి శాయశక్తులా శ్రమించాము. కఠినమయిన దాన్ని మృదువయిన దానికి వ్యతిరేకంగా భావించి దాన్ని అభినందించాం.*
*లావోట్జు... రాయిలా కఠినంగా వుండకు. మృదువుగా నీళ్ళలా వుండు' అన్నాడు. చివర్న మృదువయింది కఠినమయిన దాని మీద విజయం సాధిస్తుంది. ఒక రోజు రాయి మాయమయి పోతుంది అన్నాడు. రాయి పైన నీరు పడే కొద్దీ అది కరిగిపోతుంది. నీకు కనిపించదు. కానీ సమయం పడుతుంది. అది గ్రహించడానికి అంతర్ద్రృష్టి వుండాలి. కానీ మన చూపు మందగించింది. దూరదృష్టి వుంది. ముందుకు చూస్తాం. దగ్గరివి చూడలేం. రాయిని చూస్తాం. నీటిని చూడలేం. శాశ్వతత్వాన్ని సందర్శించగలిగిన వాళ్ళకు సత్యం బోధపడుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comentários