top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 06 - AUGUST - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 06, ఆగస్టు 2022 శనివారం, స్థిర వాసరే Thursday🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 243 / Bhagavad-Gita - 243 -6-10 ధ్యాన యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 642 / Vishnu Sahasranama Contemplation - 642 🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 321 / DAILY WISDOM - 321 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 221 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹06, August 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*


*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 2 🍀*


*3. ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే*

*ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః*

*4. మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే*

*మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : భగవానుడు మనకు పరమ మిత్రుడు. మనలను ఎప్పుడు లాలించాలో తెలియడమే కాక, ఎప్పుడు దండించాలో కూడ ఆయనకు తెలుసు. ఎప్పుడు కాపాడాలో తెలియడమే కాక, ఎప్పుడు హతమార్చాలో కూడా ఆయనకు తెలుసు.🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల-నవమి 26:12:40 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: విశాఖ 17:52:36 వరకు

తదుపరి అనూరాధ

యోగం: శుక్ల 12:42:47 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: బాలవ 15:03:50 వరకు

వర్జ్యం: 00:04:02 - 01:36:54

మరియు 21:38:30 - 23:09:06

దుర్ముహూర్తం: 07:39:25 - 08:30:47

రాహు కాలం: 09:09:18 - 10:45:36

గుళిక కాలం: 05:56:43 - 07:33:00

యమ గండం: 13:58:11 - 15:34:29

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 09:21:14 - 10:54:06

మరియు 30:42:06 - 32:12:42

సూర్యోదయం: 05:56:43

సూర్యాస్తమయం: 18:47:05

చంద్రోదయం: 13:12:01

చంద్రాస్తమయం: 00:42:15

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: తుల

శుభ యోగం - కార్య జయం 17:52:36

వరకు తదుపరి అమృత యోగం

- కార్య సిధ్ది


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




🌹. శ్రీమద్భగవద్గీత - 243 / Bhagavad-Gita - 243 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 10 🌴


10. యోగీ యు‍‌‌జ్ఞీత సతతమాత్మానం రహసి స్థిత: |

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహ: ||


🌷. తాత్పర్యం :

యోగియైన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములో నియుక్తము చేసి, ఒంటరిగా ఏకాంతస్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సు నియమింపవలెను. అతడు కోరికల నుండియు మరియు సమస్తమును కలిగియుండవలెనను భావనలనుండియు ముక్తుడై యుండవలెను.


🌷. భాష్యము :

బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు మూడువిధములుగా వివిధదశలలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభవమునకు వచ్చును. అట్టి దేవదేవుని దివ్యమగు ప్రేమయుక్తసేవ యందు సదా నెలకొనియుండుటయే కృష్ణభక్తిరసభావనమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. అయినను నిరాకారబ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభావము నందు అనురక్తులైనవారు సైతము పాక్షికముగా కృష్ణభక్తిరసభావితులే యనబడుదురు. ఏలయన నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా, పరమాత్మ రూపము శ్రీకృష్ణుని సర్వత్రా వ్యాపించియున్నటువంటి రూపము. అనగా నిరాకారవాదులు మరియు యోగులు సైతము పరోక్షముగా కృష్ణభక్తులే. కాని కృష్ణభక్తిపరాయణుడు బ్రహ్మమననేమో మరియు పరమాత్మయననేమో సంపూర్ణముగా తెలిసియున్నందున ఆధ్యాత్మికులలో అత్యున్నతుడై యున్నాడు. పరతత్త్వమును గూర్చిన అతని జ్ఞానము సంపూర్ణమై యుండగా, నిరాకారవాదులు మరియు యోగులు కృష్ణభక్తిభావన యందు అసంపూర్ణులై యున్నాడు.


అయినను శీఘ్రముగనో లేదా ఆలస్యముగనో అత్యున్నత పుర్ణత్వమును బడయుటకై వారందరును తమ తమ సాధనల యందు నిష్ఠగా కొనసాగవలెనని ఇచ్చట ఉపదేశించబడిరి. శ్రీకృష్ణుని యందే మనస్సును సంలగ్నము చేయుట యోగి యొక్క ప్రథమకర్తవ్యము. క్షణకాలమును మరువక కృష్ణునే అతడు సదా స్మరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణభగవానునిపై మనస్సు కేంద్రీకృతమగుటయే “సమాధి” యనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 243 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj


🌴 Chapter 6 - Dhyana Yoga - 10 🌴


10. yogī yuñjīta satatam ātmānaṁ rahasi sthitaḥ

ekākī yata-cittātmā nirāśīr aparigrahaḥ


🌷 Translation :

A transcendentalist should always engage his body, mind and self in relationship with the Supreme; he should live alone in a secluded place and should always carefully control his mind. He should be free from desires and feelings of possessiveness.


🌹 Purport :

Kṛṣṇa is realized in different degrees as Brahman, Paramātmā and the Supreme Personality of Godhead. Kṛṣṇa consciousness means, concisely, to be always engaged in the transcendental loving service of the Lord. But those who are attached to the impersonal Brahman or the localized Supersoul are also partially Kṛṣṇa conscious, because the impersonal Brahman is the spiritual ray of Kṛṣṇa and the Supersoul is the all-pervading partial expansion of Kṛṣṇa.


Thus the impersonalist and the meditator are also indirectly Kṛṣṇa conscious. A directly Kṛṣṇa conscious person is the topmost transcendentalist because such a devotee knows what is meant by Brahman and Paramātmā. His knowledge of the Absolute Truth is perfect, whereas the impersonalist and the meditative yogī are imperfectly Kṛṣṇa conscious.


Nevertheless, all of these are instructed herewith to be constantly engaged in their particular pursuits so that they may come to the highest perfection sooner or later. The first business of a transcendentalist is to keep the mind always on Kṛṣṇa. One should always think of Kṛṣṇa and not forget Him even for a moment. Concentration of the mind on the Supreme is called samādhi, or trance. In order to concentrate the mind, one should always remain in seclusion and avoid disturbance by external objects. He should be very careful to accept favorable and reject unfavorable conditions that affect his realization.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 642/ Vishnu Sahasranama Contemplation - 642🌹*


*🌻642. కాలనేమినిహా, कालनेमिनिहा, Kālaneminihā🌻*


*ఓం కాలనేమినిఘ్నే నమః | ॐ कालनेमिनिघ्ने नमः | OM Kālaneminighne namaḥ*


*కాలనేమినిహా, कालनेमिनिहा, Kālaneminihā*


*అసురం కాలనేమింనిజఘానేతి జనార్దనః ।*

*కాలనేమినిహేత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥*


*కాలనేమియను రక్కసుని సంహరించినందున ఆ జనార్దనునికి కాలనేమినిహా అను నామము గలదు.*


:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::

ఆ. కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి, తార్‍క్ష్యు శిరము శూలధారఁ బొడువ

నతని పోటుముట్టు హరి కేల నంకించి, దానఁ జావఁ బొడిచె దానవునిని. (345)


*కాలనేమి అను దానవ వీరుడు భయంకరమైన సింహముపై కూర్చొన్నవాడై, గరుడుని తలపై వాడియైన బల్లెముతో కుమ్మినాడు. వాని ఆయుధమును విష్ణువు పట్టుకొని దానితోనే ఆ రక్కసుడు చనిపోయేటట్లు పొడిచి సంహరించినాడు.*


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 642🌹*


*🌻642. Kālaneminihā🌻*


*OM Kālaneminighne namaḥ*


असुरं कालनेमिंनिजघानेति जनार्दनः ।

कालनेमिनिहेत्युक्तो वेदविद्या विशारदैः ॥


*Asuraṃ kālanemiṃnijaghāneti janārdanaḥ,*

*Kālaneminihetyukto vedavidyā viśāradaiḥ.*


*Since Lord Janārdana killed the demon Kālanemini,He is called Kālaneminihā.*


:: श्रीमद्भागवते अष्टमस्कन्धे दशमोऽध्यायः ::

दृष्ट्वा मृधे गरुडवाहमिभारिवाह आविध्य शूलमहिनोदथ कालनेमिः ।

तल्लिलया गरुडमूर्ध्नि पतद्गृहीत्वा तेनाहनन्नृप सवाहमरिं त्र्यधीशः ॥ ५६ ॥


Śrīmad Bhāgavata - Canto 8, Chapter 10

Dr̥ṣṭvā mr̥dhe garuḍavāhamibhārivāha āvidhya śūlamahinodatha kālanemiḥ,

Tallilayā garuḍamūrdhni patadgr̥hītvā tenāhanannr̥pa savāhamariṃ tryadhīśaḥ. 56.


*Being carried by a lion, the demon Kālanemini when he saw that the Lord carried by Garuda, was on the battlefield, he immediately took his trident, whirled it and discharged it at Garuda's head. Lord Hari, the master of the three worlds, immediately caught the trident, and with the very same weapon he killed the enemy Kalanemi, along with his carrier, the lion.*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 321 / DAILY WISDOM - 321 🌹*

*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*

*✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ*


*🌻 16. ముందుగా సమస్యను గుర్తించండి 🌻*


*రోగ నిర్ధారణ సరిగ్గా చేయకపోతే ఏ ఔషధం సరైనదిగా పరిగణించబడదు. అనారోగ్యం ఏమిటో మీకు తెలియకపోతే మీరు ఏ ఔషధాన్ని సూచించలేరు. మీరు విపస్సన, జప యోగ, ఆసన, ప్రాణాయామం, కర్మ యోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, రాజయోగ, పవిత్ర స్థలాలకు తీర్థయాత్ర, మహాత్ములతో సత్సంగ మొదలైనవి చేయవచ్చు, కానీ ఇది మందుల దుకాణం నుండి అన్ని రకాల మందులను తినడం లాంటిది. సరే, తీసుకో, అయితే నీ జబ్బు ఏమిటి? మీ జబ్బు ఏమిటో మీకు తెలియకపోతే, ఈ మందులు ఎటువంటి ప్రయోజనం పొందవు.*


*అందువల్ల, ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ తమకున్న ఇబ్బంది ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి; ఇబ్బంది యొక్క స్వభావం స్పష్టంగా ఉంటే, దాని కోసం ఏమి చేయాలో కూడా మీకు తెలుస్తుంది. మీరు విపాసన చేయవచ్చు, మీరు మీ తలపై నిలబడవచ్చు; మీకు నచ్చినది చేయండి, కానీ మీ సమస్య ఏమిటో తెలియకుండా అనవసరంగా ఒక పని చేయకండి. మీ సమస్య ఏమిటి? మీరు గురువులు మరియు యోగాలు మరియు ధ్యానాలు మరియు అన్నింటిని వెతుక్కుంటూ నడుస్తున్నా ఫలితం రాకపోవడానికి, మీరు చేస్తున్న తప్పు ఏమిటి? ఎవరైనా సరే, వారిని స్వంతంగా స్పష్టంగా ఉండనివ్వండి. సరే, మీ సమస్య విశ్వం నుండి విడిపోవడమే అయితే, మిమ్మల్ని మీరు విశ్వంతో ఎలా ఐక్యం చేసుకుంటారు? ఈ తప్పును ఎలా సరిదిద్దుకోబోతున్నారు? మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏమిటి?*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 321 🌹*

*🍀 📖 from Your Questions Answered 🍀*

*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*


*🌻 16. First Identify the Problem 🌻*


*No medicine can be considered as appropriate unless the diagnosis of the case is done properly. You cannot prescribe any medicine unless you know what the illness is. You may do vipassana, japa yoga, asana, pranayama, karma yoga, bhakti yoga, jnana yoga, raja yoga, pilgrimage to holy places, satsanga with mahatmas, etc., but this is like eating all kinds of medicines from a chemist shop. All right, take it, but what is your illness? Unless you know what your illness is, these medicines will not be of any utility.*


*Thus, each one who meditates must be clear about what the trouble is; if the nature of the trouble is clear, you also know what to do for that. You may do vipassana, you may stand on your head; do what you like, but don't unnecessarily do a thing without knowing what your problem is. What is your problem? What is wrong with you that you are running about in search of Gurus and yogas and meditations and all that? Let anybody be clear to one's own self. All right, if your problem is separation from the universe, how will you unite yourself with the universe? How are you going to rectify this mistake? What is the method that you are adopting?*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 221 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. ప్రపంచాన్ని పెద్ద నాటకంగా భావించాలి. ఇదంతా దేవుని నాటకమయితే అందులో మనం పాత్రలం. ఎవరూ నాటకాన్ని తీవ్రంగా తీసుకోకూడదు. మరణం వచ్చినపుడు చివరి తెర పడుతుంది. అందరూ విశ్వశక్తిలోకి అదృశ్యమవుతారు. 🍀*


*నువ్వు ప్రపంచంలో జీవించాలి. కానీ ప్రపంచాన్ని పెద్ద నాటకంగా భావించాలి. నేను ప్రపంచాన్ని వదిలెయ్యడానికి వ్యతిరేకిని. ప్రపంచం నించీ పారిపోకూడదు. దాంట్లో జీవించాలి. కానీ పూర్తిగా భిన్నరీతిలో జీవించాలి. దాన్ని భారంగా తీసుకోకు. తేలిగ్గా తీసుకో. అది విశ్వం వదిలిన మాయా బాణం. ప్రాచ్యంలో మనం దాన్ని ఆట 'అంటాం' అది దేవుని నాటకమయితే అందులో మనం పాత్రలం. ఎవరూ నాటకాన్ని తీవ్రంగా తీసుకోకూడదు. నువ్వు నాటకంలో రాజు కావచ్చు. కానీ దాన్ని అంతిమ సత్యంగా తీసుకోకూడదు. తెర పడుతూనే నువ్వు రాజన్న సంగతి మరిచిపోవాలి. తరువాత అది మనసులోకి రాకూడదు. నువ్వు సంపన్నుడయితే లేదా నువ్వు పేదవాడయినా ఆ విషయాన్ని పట్టించు కోవద్దు.*


*మనందరం ఈ ప్రపంచంలో పాత్రదారులమే. వాటిని వీలయినంత చక్కగా నిర్వర్తిద్దాం. కానీ ఇదంతా విశ్వం ఆడుతున్న ఆట అనే సంగతి మరచిపోవద్దు. మరణం వచ్చినపుడు చివరి తెర పడుతుంది. అప్పుడు నటులందరూ మాయమయిపోతారు. వాళ్ళంతా విశ్వశక్తిలోకి అదృశ్యమవుతారు. వ్యక్తి ప్రపంచంలో వున్నంత వరకు ఈ విషయం గుర్తుంచు కోవాలి. వ్యక్తి అన్ని రకాలయిన దుఃఖాల నుండి విముక్తుడు కావాలి. విషయాల్ని తీవ్రంగా తీసుకుంటే దాన్ని అనుసరించి దుఃఖాలు వస్తాయి. విషయాల్ని తేలిగ్గా తీసుకుంటే దాన్ననుసరించి ఆనందం వస్తుంది. నవ్వులాటగా తీసుకో. ఆనందించు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comentários


Post: Blog2 Post
bottom of page